కోడి మఠం స్వామిజీ జోస్యం నిజం: సంకీర్ణ ప్రభుత్వానికి హడల్, ఆయుష్యు తక్కువే, విత్తనాలు, పంట !
దావణగెరె (బెంగళూరు): కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై ఆ రాష్ట్రంలోని కోడిహళ్ళి మఠాధిపది శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ జోస్యం చెప్పారు. కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఈ ప్రభుత్వానికి ఆయుష్యు తక్కువగా ఉందని శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విత్తనాలు వేస్తే పంట కోసం !
విత్తనాలు ఒకరు వేస్తే పంట కోసం ఒకరు ఎదురు చూస్తారని, అయితే ఆ పంటను ఎత్తుకు వెళ్లే వారు మరొకరని గత శాసన సభ ఎన్నికలకు ముందు తాను ఢీల్లీలో చెప్పానని శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ గుర్తు చేశారు. శాసన సభ ఎన్నికలకు ముందు తాను చెప్పినట్లు ఇప్పుడు జరుగుతున్నదని స్వామిజీ అన్నారు.

ఎన్నికలకు ముందే జోస్యం
ఒక సంవత్సరం 18 నెలల తరువాత కర్ణాటకలో మళ్లీ రాజకీయ నాయకులు ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తారని గత శాసన సభ ఎన్నికలకు మందు శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ చెప్పారు. శాసన సభ ఎన్నికలకు ముందు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని శ్రీ శివానంద శివయోగవి రాజేంద్ర స్వామిజీ అన్నారు.

ఆయుష్యు లేదు !
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎక్కువ అయుష్యు లేదని అంటున్న స్వామిజీ త్వరలోనే అది కుప్పకూలిపోతుందని అంటున్నారు. కర్ణాటక రాజకీయాల గురించి గతంలో శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ చేసిన వ్యాఖ్యలు దాదాపు నిజం అయ్యాయి.

కర్ణాటక సీఎం కుమారస్వామి
శాసన సభ ఎన్నికల ముందే కర్ణాటకలో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రాదని స్వామిజీ చెప్పారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, హెచ్.డి. కుమారస్వామి రెండో సారి కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారని శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ చెప్పారు.

అక్షరాల నిజం
గతంలో స్వామిజీ చెప్పినట్లు ఇప్పుడు అక్షరాల నిజం అయ్యింది. స్వామిజీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచనలో పడ్డారు. కర్ణాటకలో వాతావరణం గురించి మాట్లాడిన స్వామిజీ ఈ సంవత్సరం వర్షాల గురించి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. వీదురుగాలు వెళ్లిపోయిన తరువాత కర్ణాటకలో వర్షాలు పడుతాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications