26న కర్ణాటక బంద్: 800 సంఘాలు మద్దతు
బెంగళూరు: పలు డిమాండ్లపై ఈ నెల 26వ తేదిన కర్ణాటక బంద్ జరగనుంది. ఈ బంద్ కు 800 సంఘ, సంస్థలు మద్దతు ఇస్తున్నాయని కన్నడ చళవలి వాటాళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు వాటళ్ నాగరాజ్ అన్నారు.
బెంగళూరులో ఆయన మాట్లాడుతూ మేకదాటు ప్రాజెక్ట్ నిర్మాణం , గోవా, కర్ణాటక నీటి పంపిణి విషయాన్ని పరిష్కరించాలని, కర్ణాటకలోని అనేక ప్రాంతాలను అభివృద్ది చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు అమలు చెయ్యాలని ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని అన్నారు.

ఈ నెల 26వ తేదిన జరిగే బంద్ కు కన్నడ చిత్రరంగ పరిశ్రమ, లారీ యజమానుల సంఘం, రవాణా శాఖ కార్మికులు, ఆటో యూనియన్ సంఘాలు, పలు కన్నడ సంఘాలతో పాటు మొత్తం 800 మంది సంఘ, సంస్థలు బంద్ కు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.
సెప్టెంబర్ 26వ తేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ణాటక బంద్ నిర్వహిస్తామని చెప్పారు. శాంతియుతంగా తాము బంద్ నిర్వహించి తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు.
తమిళనాడు, గోవా ప్రభుత్వాలు కన్నడిగులకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాలను సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంలో సినీరంగ ప్రముఖులు, పలు కన్నడ సంఘాల నాయకులు మాట్లాడారు.












Click it and Unblock the Notifications