బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్: 55 గంటల వీకెండ్ లాక్‌డౌన్‌కు కౌంట్‌డౌన్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 1,16,836 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కరోనా మహమ్మారి విరుచుకుని పడటం ఏడు నెలల తరువాత ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. 3,52,25,699కి చేరాయి.

అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాలివే..

అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాలివే..


అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ 36,265 మంది కోవిడ్ బారిన పడ్డారు. దీని తరువాత పశ్చిమ బెంగాల్-15,421, ఢిల్లీ-15,097 నిలిచాయి. కర్ణాటక-5,031, కేరళ-4,649, గుజరాత్-4,213 మేర కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో ఆయా రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇవ్వాళ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కర్ణాటక మంత్రికి వైరస్

కర్ణాటక మంత్రికి వైరస్

కర్ణాటకలో ఇవ్వాళ కూడా కరోనా పాజిటివ్ కేసులు ఆరు వేలను దాటే అవకాశాలు లేకపోలేదు. అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు వెల్లువ కొనసాగుతోంది. తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక కరోనా వైరస్ బారిన పడ్డారు. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కోవిడ్ నిర్దారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో ఆయన బెంగళూరులో మణిపల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యవసర చికిత్సను పొందుతున్నారు.

ఆసుపత్రిలో అడ్మిట్..

ఆసుపత్రిలో అడ్మిట్..

కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో- ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో మంత్రి అశోక పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, తోటి మంత్రులు, అధికారులను విస్తృతంగా కలుసుకొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కోవిడ్ బారిన పడటం ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. తన ఆరోగ్యం నిలకడగా ఉందని అశోక చెప్పారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటానని భరోసా ఇచ్చారు.

 వీకెండ్ లాక్‌డౌన్..

వీకెండ్ లాక్‌డౌన్..


కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా మాత్రమే ఉన్నామని వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరానని అన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని చెప్పారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని అశోక విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా- కోవిడ్ వ్యాప్తి చెందడాన్ని నివారించానికి కర్ణాటక ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలులోకి తీసుకొచ్చింది.

55 గంటల పాటు

55 గంటల పాటు


ఈ లాక్‌డౌన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ రాత్రి 10 గంటలకు లాక్‌డౌన్ ఆరంభమౌతుంది. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు ముగుస్తుంది. 55 గంటల పాటు ఉండే ఈ లాక్‌డౌన్ సందర్భంగా అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులోకి ఉంటాయి. మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు, పండ్ల దుకాణాలు తెరచి ఉంచుకోవడానికి అనుమతి ఉంది. సిటీబస్సులు పరిమితంగా నడుస్తాయి. ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి ఉంటుంది.

పరిమితంగా..

పరిమితంగా..

సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మల్లీ ప్లెక్స్‌లల్లో 50 శాతానికి మాత్రమే అనుమతి ఇచ్చారు అధికారులు. స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు మూత పడతాయి. హోటళ్లు, రెస్టారెంట్లల్లో అక్కడే కూర్చుని భోజనం చేయడాన్ని నిషేధించారు. టేక్ అవేలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు హాజరయ్యే వారిపైనా పరిమితి ఉంది. బహిరంగ ప్రదేశంలో జరిగే వివాహానికి 200, ఇన్‌డోర్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు 100 వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

English summary
Karnataka minister for Revenue R Ashoka tested positive for Covid-19. He has been admitted to a private hospital with mild symptoms and Wee end lockdown to commence today in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X