హైదరాబాద్ ఐతేనే సేఫ్: పార్క్ హయత్-తాజ్ హోటల్స్‌కు కర్ణాటక ఎమ్మెల్యేలు, అర్ధరాత్రి నుంచే..
Recommended Video

హైదరాబాద్/బెంగళూరు: కర్ణాటక రాజకీయం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారింది. కాంగ్రెస్ పార్టీకి, జేడీఎస్‌లకు చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే వారి రాక ప్రారంభమైంది. అర్ధరాత్రి కొందరు రాగా, ఆ తర్వాత కొందరు కార్లలో, బస్సుల్లో వస్తున్నారు. ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
పార్క్ హయత్‌తో పాటు తాజ్ కృష్ణకు కర్ణాటక ఎమ్మెల్యేలు వచ్చారు. గురువారం అర్థరాత్రి కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు చేరుకోవడంతో రాజకీయం తెలంగాణ రాజధానికి మారింది. అర్థరాత్రే కొందరు హోటల్‌కు చేరుకోగా, మరికొందరు ఆ తర్వాత వచ్చారు.

ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవడానికి హైదరాబాద్ సరైన ప్రదేశమని కాంగ్రెస్, జేడీఎస్ భావించి ఇక్కడికి తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్క్ హయత్ హోటల్‌తో పాటు నగర శివారులోని పలు హోటళ్లు, రిసార్ట్స్‌లోనూ ఎమ్మెల్యేల కోసం గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది.
కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు రెండు ట్రావెల్ బస్సుల్లో హైదరాబాద్ వచ్చారు. దాదాపు అందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి కాపాడుకునేందుకే హైదరాబాద్ చేర్చారని తెలుస్తోంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications