బిట్ కాయిన్, డ్రగ్స్ స్కామ్ కేసులో పోలీసు అధికారి అందర్, మైండ్ బ్లాక్ కేసు, సిట్ ఎంట్రీతో!
బిట్‌కాయిన్ స్కామ్ కేసులో మరో పోలీసు అధికారిని సిట్ అరెస్టు చేసింది. బెంగళూరు సీసీబీలో బిట్‌కాయిన్ కేసు విచారణాధికారిగా పని చేసిన ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంతయ్యను బుధవారం బెంగళూరులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లక్షీకాంతయ్యను సిట్ అరెస్టు చేసిన అధికారులు బెంగళూరు 1వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచింది. తదుపరి విచారణ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ కాంతయ్యను మార్చి 7 వరకు సిట్ కస్టడీకి ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారి శ్రీధర్ పూజర్‌ని అరెస్ట్ చేసేందుకు మంగళవారం వెళ్లగా కారులో ఆయన తప్పించుకున్నారని సిట్ అధికారులు తెలిపారు. మరో ఇన్ స్పెక్టర్ చంద్రధర్ కూడా పరారయ్యాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న శ్రీధర్ పూజార్, చంద్రధర్ కోసం సిట్ అధికారులు వెతుకుతున్నారు. బిట్‌కాయిన్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లగా నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తరువాత పోలీసుల కారును ఢీకొట్టిన నిందితుడు డీవైఎస్‌పి శ్రీధర్ పూజర్ పరారయ్యాడు.

మంగళవారం రాత్రి బెంగళూరులోని కాఫీ బోర్డు సిగ్నల్ దగ్గర ఇన్‌స్పెక్టర్ అనిల్, సిట్ బృందం అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని,శ్రీధర్ పూజార్‌పై బెంగళూరులోని విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సిట్ అధికారులు తెలిపారు. బిట్ కాయిన్ కేసులో బెయిల్ కోసం శ్రీధర్ దరఖాస్తు చేసుకోగా బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.
బెయిల్ తిరస్కరణ నేపథ్యంలో ప్రధాన నిందితుడు శ్రీధర్‌ను అరెస్టు చేసేందుకు సిట్ వెళ్లింది. ఈసారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. శ్రీధర్ ను పట్టుకునేందుకు వెళ్లిన ఎస్‌ఐటీ ఏఎస్‌ఐ భాస్కర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సిట్ ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్న నలుగురు మాజీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు పూజర్, ఇన్‌స్పెక్టర్లు ప్రశాంత్ బాబు, చంద్రధర్ ఎస్ఆర్ మరియు లక్ష్మీకాంతయ్య మరియు 2020లో దర్యాప్తులో సహకరించిన ప్రైవేట్ సైబర్ నిపుణుడు కేఎస్ సంతోష్ కుమార్,జనవరి 24వ తేదీన అరెస్టు చేసిన బాబు, కుమార్‌ల బెయిల్ పిటిషన్‌లను శుక్రవారం ప్రత్యేక సీఐడీ కోర్టు స్వీకరించింది.
క్రైం బ్రాంచ్ మాజీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ పూజార్ ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. పుజార్ విచారణకు సహకరించనందున అతడి కస్టడీ విచారణ అవసరమని కోర్టు పేర్కొంది.మూడేళ్ల క్రితం అంతర్జాతీయ స్థాయి హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీకితో పాటు అతడి స్నేహితులను బిట్ కాయిన్, డ్రగ్స్ కేసుల్లో బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బిట్‌కాయిన్ కేసులో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారాయని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
బిట్‌కాయిన్ స్కామ్ జరిగినప్పుడు బెంగళూరు సీసీబీలో పనిచేస్తున్న అధికారులను సిట్ విచారించింది. అదేవిధంగా అప్పటి సీసీబీ డీసీపీలు కేపీ రవికుమార్, బీఎస్ అంగడి, ఏసీపీ నాగరాజ్, ఇన్ స్పెక్టర్లను విచారించిన సిట్ ఎట్టకేలకు ఐజీపీ సందీప్ పాటిల్ ను విచారించింది. ఇప్పుడు విచారణలో భాగంగా కథ అనేక మలుపులు తిరగడంతో సిట్ అధికారులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద బిట్ కాయిన్ స్కామ్ కేసు ఎంత వరకు వెలుతుందో ?, ఈ కేసులో ఇంకా ఎంతమంది పోలీసులు ఉన్నారో ? అని అందరూ ఆసక్తిగా ఈ కేసు సమాచారం తెలుసుకుంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications