మూడు ముక్కలైన బళ్లారి రెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ, బళ్లారిలో ఏం జరుగుతోంది, ఎవరు ?
బెంగళూరు/బళ్లారి: ఒకే ఇంటికి మూడు తలుపులు, మూడు కాపురాలు లాంటి సన్నివేశాలు మనం సినిమాలు, ఎక్కువగా టీవీ సీరియల్స్ లో చూస్తుంటాము. అయితే దశాభ్దాలుగా అన్ని విషయాల్లో కలసిమెలసి రాజకీయాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకున్న బళ్లారి రెడ్డి బ్రదర్స్ ఇప్పుడు మూడుముక్కలుగా విడిపోయారు.
బళ్లారి అంటేనే టక్కుల అందరూ చెప్పే పేరు రెడ్డి బ్రదర్స్ అని. 1999లో బళ్లారి లోక్ సభ నియోజక వర్గంలో సోనియా గాంధీ మీద సుష్మా స్వరాజ్ పోటీ చేసిన సందర్బంలో గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ తెరమీదకు వచ్చారు. సుష్మా స్వరాజ్ ను గెలిపించడానికి రెడ్డి బ్రదర్స్ చేసిన అనేక ప్రయత్నా కారణంగా గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ హైకమాండ్ కంట్లో పడ్డారు.

తరువాత ప్రతి సంవత్సరం వరమహాలక్ష్మి పండుగ రోజు సుష్మా స్వరాజ్ బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డికి వెళ్లి పూజలు చెయ్యడంతో గాలి జనార్దన్ ఫ్యామిలీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోవడంతో ఆయన, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు.
గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు 2004లో బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యేగా, గాలి సోమశేఖర్ రెడ్డి తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి బళ్లారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో గాలి జనార్దర్ రెడ్డి అన్న గాలి కరుణాకర్ రెడ్డి బీజేపీ ఎంపీగా విజయం సాధించారు. 2006లో గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు.
తరువాత బళ్లారి శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి మంత్రి పదవులు చేపట్టి బీజేపీలో తిరుగులేని నాయకులు అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లిన తరువాత ఆయన కుటుంబానికి గాలి కరుణాకర్ రెడ్డి పూర్తిగా దూరం అయ్యారు. అప్పటి నుంచి గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డికి గాలి కరుణాకర్ రెడ్డి పూర్తిగా దూరం అయ్యారు.

గత డిసెంబర్ నెలలో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చి కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ పెట్టడంతో ఆయనకు తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి దూరం అయ్యారు. బళ్లారి సిటీ నియోజక వర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి మీద గాలి జనార్దర్ రెడ్డి ఆయన భార్య లక్ష్మీ అరుణను కేఆర్ పీ పార్టీ అభ్యర్థిగా పోటీ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
బళ్లారి సిటీలో వదిన లక్ష్మీ అరుణ, మరిది గాలి సోమశేఖర్ రెడ్డి రంగంలో ఉండటంతో ఆ నియోజక వర్గంలో ఎవ్వరు గెలుస్తారు అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వదిన మీద తాను గెలుస్తానని గాలి సోమశేఖర్ రెడ్డి, మరిది మీద తాను గెలుస్తానని లక్ష్మీ అరుణ ధీమాగా ఉన్నారు. బళ్లారిలో అడుగు పెట్టకపోయినా తప భార్య లక్ష్మీ అరుణను గెలిపించుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications