వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందీ జాతీయభాష కానేకాదు-సుదీప్ కు కర్నాటక సంపూర్ణ మద్దతు-బీజేపీ కూడా

|
Google Oneindia TeluguNews

హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ హీరో సుదీప్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం దానికి కౌంటర్ గా హాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చేసిన ట్వీట్లు కర్నాటకలో తీవ్ర దుమారం రేపాయియ. కన్నడ జాతీయ భావనను రగిలించాయి. ఫలితంగా అజయ్ దేవ్ గణ్ కు వ్యతిరేకంగా, హీరో సుదీప్ కు మద్దతుగా అక్కడి రాజకీయ పక్షాలన్నీ ఏకమయ్యాయి.

అజయ్ దేవ్ గణ్ హిందీ జాతీయ భాషపై చేసిన వ్యాఖ్యలపై కన్నడ రాజకీయ పక్షాలు ఒక్కొక్కటిగా గళం విప్పాయి. కాంగ్రెస్, జేడీఎస్ ముందుగా స్పందించగా... ఆ తర్వాత అధికార బీజేపీ కూడా స్పందించాల్సి వచ్చింది. కొంతకాలంగా పలు మతపరమైన అంశాలపై చీలిపోతున్న కర్నాటక తమ భాష వ్యవహారానికి వచ్చే సరికి ఏకమైంది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు సుదీప్ కు మద్దతుగా రంగంలోకి దిగారు. ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడంతో పాటు నేరుగా కూడా స్పందించారు.

karnataka unites against actor ajay devgn over hindi row, full support to sudeep

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్, కన్నడ నటుడు సుదీప్ మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, హిందీ ఎప్పటికీ భారతదేశ జాతీయ భాష కాదని అన్నారు. తాను కన్నడుడిగా గర్వపడుతున్నానన్నారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని అభినందించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. ప్రతి భాషకు దాని స్వంత గొప్ప చరిత్ర ఉంది, దాని ప్రజలు గర్వించదగినది" అని సిద్ధరామయ్య అన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై కూడా కన్నడ హీరో కిచ్చా సుదీప్‌కు అనుకూలంగా స్పందించారు. భాషల వల్లే మన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చారని, సుదీప్ చెప్పిన మాట నిజమేనని, దాన్ని అందరూ గౌరవించాలని బొమ్మై అన్నారు. ఈ విషయంలో హీరో సుదీపే కరెక్ట్ అని బొమ్మై తెలిపారు. అంతకుముందు జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ మద్దతు ఉన్న అజయ్ దేవగణ్ కన్నడ హీరో సుదీప్ ను టార్గెట్ చేయడంపై మండిపడ్డారు. కుమారస్వామి వ్యాఖ్యల తర్వాత బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో సీఎం బొమ్మై కూడా సుదీప్ కు మద్దతుగా స్పందించారు.

English summary
all political parties in karnataka has been united against bollywood hero ajay devgn against his comments on hero sudeep over hindi national language.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X