వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్: వరుస బెట్టి ఫిర్యాదులు.. వేదిక మీదే స్పృహ తప్పిన కలెక్టర్..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఓ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. వేదిక మీదే స్పృహ తప్పిన ఘటన ఇది. కర్ణాటకలోని కార్వారలో గురువారం చోటు చేసుకుంది. ఆ కలెక్టర్ పేరు హరీష్ కుమార్. ఉత్తర కన్నడ జిల్లా అధికారి. లో-బీపీ వల్లే ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.సొమ్మసిల్లిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కొంత విశ్రాంతి తరువాత ఆయన మామూలు స్థితికి చేరుకున్నారు.

ప్రాణాలు నిలిపే అంబులెన్సే.. ఇద్దరి ఉసురు తీసింది: పది అడుగులు గాల్లోకి లేచిన బైక్..!ప్రాణాలు నిలిపే అంబులెన్సే.. ఇద్దరి ఉసురు తీసింది: పది అడుగులు గాల్లోకి లేచిన బైక్..!

ఉత్తర కన్నడ జిల్లాలో వారంలో రెండు రోజుల పాటు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు అక్కడి జిల్లా అధికారులు. గురువారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని హరీష్ కుమార్ హాజరయ్యారు. స్వయంగా ఫిర్యాదులను స్వీకరించసాగారు. వరుసగా ఫోన్లు వస్తుండటం, వాటికి సుదీర్ఘంగా సమాధానాలను ఇవ్వాల్సిన పరిస్థితిని హరీష్ కుమార్ ఎదుర్కొన్నారు.

Karnataka: Uttara Kannada DC Harish Kumar unconscious on the dias

కొన్ని ఫోన్ కాల్స్‌ను స్వీకరించిన తరువాత.. ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపు తప్పింది. ఉన్నట్టుండి కుర్చీ నుంచి కిందికి పడిపోయారు. అక్కడే ఉన్న సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. మంచినీళ్లను తాగించారు. అనంతరం సమీప ఆసుపత్రికి తరలించారు. హరీష్ కుమార్‌ను పరిశీలించిన తరువాత.. లో-బీపీ వల్లే సొమ్మసిల్లిపోయారని తెలిపారు. విశ్రాంతి తీసుకున్న తరువాత ఆయన సాధారణ స్థితికి చేరుకున్నారు.

English summary
Karnataka: Uttara Kannada Deputy Commissioner Harish Kumar unconscious on the dias. The Programme had arranged in Karwara in Karnataka. Information department have arranged this Phone-In Programme with the Deputy Commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X