ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్.. ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా..?

భారత్ లో రైల్వేలు మొదటిసారిగా 1853 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 1947 లో స్వాతంత్ర్యం వచ్చేనాటికే దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడ్డాయి. అయితే 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని ఇండియన్ రైల్వేస్.. ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా ఆవిర్భవించింది. ఆనాటి నుంచి నేటి వరకూ ఇండియన్ రైల్వేస్ లో ఎన్నో సంచలన మార్పులు వచ్చాయి. రోజూ లక్షల మందికి ప్రయాణ మార్గంగా రైల్వే వ్యవస్థ ఉంది.

భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాల్గొవ అతిపెద్ద నెట్‌వర్క్ గా ఉంది. ఇది దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్‌ లు, 68 డివిజన్లతో సుమారు 1,23,000 కిలోమీటర్లకు విస్తరించి ఉంది. 1853లో బొంబాయి-థానే మధ్య మొదటి ప్రయాణీకుల రైలు నడిచినప్పటి నుండి భారత రైల్వేలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి.

అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ఎక్కడో ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ కర్ణాటకలో ఉంది. శ్రీ సిద్ధరూధ స్వామిజీ హుబ్లీ జంక్షన్(SSS హుబ్లీ జంక్షన్) కర్ణాటకలో ఉంది. ఈ రైల్వే ప్లాట్ ఫామ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను కూడా నెలకొల్పింది. హుబ్లీ ప్లాట్ ఫామ్ పొడవు 1,507 మీటర్లుగా ఉంది. అంటే కిలోమీటరన్నర ఉంటుంది. ఒక రైలు మొత్తాన్ని ఈ ప్లాట్ ఫామ్ పూర్తిగా కవర్ చేస్తుంది.

Karnataka s Rail Marvel SSS Hubli Junction Boasts World s Longest Platform at 1 5KM

ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ స్టేషన్ కు ఉంది. గోరఖ్ పుర్ రైల్వే ప్లాట్ ఫామ్ పొడవు 1,366 మీటర్లుగా ఉంది. అయితే దీన్ని హుబ్లీ ప్లాట్ ఫామ్ అధిగమించింది. శ్రీ సిద్ధరూధ స్వామిజీ హుబ్లీ జంక్షన్(SSS హుబ్లీ జంక్షన్) రైల్వే స్టేషన్ కర్ణాటకలో ప్రధానమైన రైల్వే హబ్ గా ఉంది. ఇది బెంగళూరు, హోస్పేట్, వాస్కోడగామా, బెలగావి, ప్రాంతాలకు ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+