నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్న కరుణానిధి
చెన్నై: గత కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధి నేడు డిశ్చార్జి అవనున్నారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం కుదుటపడిందని, క్షేమంగా ఇంటికి వస్తున్నారని కరుణానిధి తనయుడు స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, రెండు రోజుల క్రితం కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఫొటోను కావేరి ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న గొంతు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్
సమస్యతో కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చేరారు.













Click it and Unblock the Notifications