టెర్రిరిస్టులకు కశ్మీర్ డీజీపీ వార్నింగ్: మీకూ కుటుంబాలు ఉన్నాయ్!.. గుర్తుంచుకోండి
పోలీసుల ఇళ్లపై ఉగ్రవాదుల వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన డీజీపీ తమకు కుటుంబాలున్న సంగతి ఉగ్రవాదులు మరిచిపోవద్దని టెర్రరిస్టులకు హెచ్చరిక చేశారు.
శ్రీనగర్: కల్లోలిత ప్రాంతంగా నిత్యం ఏదో ఒక అలజడి రేగే కశ్మీర్ లో విధి నిర్వహణ అంటే పోలీసులకు కత్తి మీద సాము లాంటిదే. ఈమధ్య కాలంలో పోలీస్ కుటుంబాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు.. ఉద్యోగాలు మానేయాలంటూ వారిని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వేడ్ మిలిటెంట్లకు గట్టిగా హెచ్చరిక చేశారు. పోలీసుల ఇళ్లపై దాడులు, దోపిడీలకు పాల్పడేవారికి కూడా కుటుంబాలు ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ఉగ్రవాదులను హెచ్చరించారు. అనవసరంగా కుటుంబాలను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు.

పోలీసులు కుటుంబాలను టార్గెట్ చేసుకుని వేధిస్తే.. తాము కూడా ఉగ్రవాదుల కుటుంబాలను వేధిస్తామని ఎస్పీ అన్నారు. కాగా, మంగళవారం నాడు ఓ పోలీసు ఇంట్లో దోపిడికి పాల్పడిన ఉగ్రవాదులు.. ఇంటి నుంచి పరారయ్యేప్పుడు ఉద్యోగం మానిపించాలని పోలీస్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
మరో డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ అధికారి ఇంట్లోను గత శనివారం దోపిడీకి పాల్పడిన కొంతమంది ఉగ్రవాదులు.. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో సదరు పోలీస్ కుటుంబాన్ని హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేయించాలని బెదిరించారు.
ఈ వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన డీజీపీ తమకు కుటుంబాలున్న సంగతి ఉగ్రవాదులు మరిచిపోవద్దని టెర్రరిస్టులకు హెచ్చరిక చేశారు.












Click it and Unblock the Notifications