కేదార్‌నాథ్ ఆలయం క్లోజ్.. మళ్లీ ఆరు నెలల తరువాతే ఓపెన్..!

భాయ్ దూజ్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్‌నాథ్ ఆలయాన్ని శాస్త్రోక్తంగా మూసివేశారు. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య.. మందాకినీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది చలి తీవ్రత ప్రారంభమయ్యే సమయాన భక్తుల సమక్షంలో ఆలయ ద్వారాలను మూసి వేసే ఆచారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా అదే రీతిలో కొనసాగించారు.

కాగా భాయ్ దూజ్ పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, మంగళ హారతి, భజనాలు, వేదపారాయణాలతో ఆలయం అంతట భక్తి తరంగాలు అలముకున్నాయి. చివరగా పండితులు శాస్త్రోక్తంగా ద్వారబంధన పూజ నిర్వహించగా, ఆలయ ప్రధాన గర్భగృహ ద్వారం మూసి వేసారు.

kedarnath-temple-in-uttarakhand-closed-and-reopened-after-6-months

ఆరు నెలల పాటు ఉఖీమఠ్‌లో పూజలు..

ఏడాదిలో ఆరు నెలలు హిమపాతం కారణంగా కేదార్‌నాథ్ ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోతాయని తెలిసిందే. ఆ సమయంలో కేదారేశ్వరుని పల్లకి ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించబడుతుంది. అక్కడే శివునికి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం కూడా ఈ సాంప్రదాయం ప్రకారం స్వామివారి పల్లకి శోభాయాత్రగా ఉఖీమఠ్ వైపు బయలుదేరింది.

ఈ ఏడాది కేదార్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో 17.39 లక్షల మంది భక్తులు విచ్చేశారు. బుధవారం ఒక్కరోజే ఐదు వేలకు పైగా భక్తులు కేదార్‌నాథ్ దర్శనం చేసుకున్నారు. దాంతో చార్ ధామ్ యాత్ర ఈ ఏడాది విజయవంతంగా ముగిసింది. గంగోత్రి ఆలయం అక్టోబర్ 22న.. యమునోత్రి ఆలయం అక్టోబర్ 23న మూసివేయబడగా.. బద్రీనాథ్ ఆలయం నవంబర్ 25న మూసివేయబడనుంది. ఈ క్రమంలో కేదార్‌నాథ్ ఆలయం మూతపడడం ద్వారా చార్ ధామ్ యాత్ర దాదాపు ముగింపు దశకు చేరింది.

మరోవైపు కేదార్‌నాథ్ ఆలయ మూసివేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది, ఉపాధ్యక్షుడు రిషి ప్రసాద్ సతీ, విజయ్ కప్రవన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ పూజా కార్యక్రమాలను కేదార్ సభ అధ్యక్షుడు పండిత్ రాజ్‌కుమార్ తివారీ, ధర్మాధికారి ఓంకార్ శుక్లా, పూజారులు బాగేశ్ లింగ్, ఆచార్య సంజయ్ తివారీ పర్యవేక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+