క్రిమినల్స్ జైలుకు- మహిళలు స్వేచ్చగా తిరగాలి: సహరాన్‌పూర్ ర్యాలీలో మోడీ

యూపీలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను నేతలు చేస్తున్నారు. తిరిగి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని మోడీ కోరారు. ఆయన ఇవాళ సహరాన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. వయోజనులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉందన్నారు. యూపీ అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పారు. ఇవాళ ఉదయం వేళలో కూడా ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారని చెప్పారు. వారందరిని మోడీ అభినందించారు. యూపీలో ఇక అల్లర్లకు తావులేదని.. తమ సోదరీలు స్వేచ్చగా తిరగాలని అన్నారు. క్రిమినల్స్‌ను జైలుకు పంపించడంతో భయం లేకుండా ఉండొచ్చు అని చెప్పారు.

Keep UP riot-free, keep our sisters free from fear: PM Modi appeals to voters

కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు అన్నీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. పీఎం కిసాన్ యోజన.. ఇతర పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చెరకు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. షుగర్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కామనేనని.. చెరకును ఇథనాల్ ఉత్పత్తి కోసం కూడా వాడుతామని చెప్పారు. చక్కెర నుంచి వచ్చే ఇథనాల్ కోసం రూ.1200 కోట్లను ఖర్చు చేస్తున్నామని వివరించారు. త్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలను ఇస్తోందని చెప్పారు.

Recommended Video

    Uttar Pradesh Elections 2022 :'Come Out And Vote' - Rahul Gandhi | Oneindia Telugu

    తొలివిడతలో మొత్తం 11 జిల్లాల్లో గల 58 నియోజకవర్గాల ఓటింగ్ జరగనుంది. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది. యూపీలో మొత్తం 7 విడతలో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఆ రోజు ఎవరూ రాజు తెలియనుంది. యూపీలో విజయం సాధిస్తే.. దేశంలో అధికారం చేపట్టడం ఖాయం అని బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చిన సంగతి తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+