Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi Accident: ఢిల్లీ యాక్సిడెంట్ ఘటనలో సీసీ ఫుటేజ్ విడుదల.. వారి ఉరిశిక్ష వేయాలన్న కేజ్రీవాల్..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలమంది రోడ్డుపైకి
ఆందోళన వ్యక్తం చేశారు. సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ వెలుపల నిరసన తెలిపారు. ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున . స్కూటీపై వెళుతున్న యువతిని ఢీకొట్టిన కారు.. ఆమెను 20 కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది.

డిసెంబర్ 31న

డిసెంబర్ 31న

ఐదుగురు నిందితులు డిసెంబర్ 31న తప్ప తాగి మారుతి సుజికీ బెలానో కారుతో యువతిని ఢీకొట్టారు. ఢీకొట్టడమే కాదు కిలోమీటర్లు దూరం ఈడ్చుకెళ్లారు. నిందితుల్లో ఒకరు క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాప్ యజమాని ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి
దీపక్ దహియా వివరించారు.

18 నుంచి 20 కిలోమీటర్లు

18 నుంచి 20 కిలోమీటర్లు

ఆయన లాడ్‌పూర్ గ్రామంలోని కంఝవాలా రోడ్డులో మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. తమ వాహనానికి చిక్కిన మహిళ మృతదేహాన్ని నిందితులు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లారని, అది దాదాపు గంటన్నర పాటు కొనసాగిందని ఆయన చెప్పారు.

ఉదయం 3:20

ఉదయం 3:20

"ఉదయం 3:20 అయింది.. నేను షాపు బయట నిలబడి ఉండగా 100 మీటర్ల దూరంలో వాహనం నుంచి పెద్ద శబ్ధం వినిపించింది. టైరు పగిలిందని అనుకున్నాను. కారు కదిలిన వెంటనే ఒక మృతదేహం కనిపించింది. వారు మృతదేహాన్నీ ఈడ్చుకెళ్లారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను" అని దహియా తెలిపారు.

గంటన్నర పాటు

కొంత సమయం తరువాత, తెల్లవారుజామున 3:30 గంటలకు, కారు యు-టర్న్ తీసుకుందని, మహిళ మృతదేహం వాహనం కింద ఇరుక్కుపోయిందని అతను చెప్పాడు. నిందితులు దాదాపు 4-5 కిలోమీటర్ల రోడ్డుపై యూటర్న్‌లు తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేశారని దహియా వివరించారు. "నేను చాలాసార్లు వారిని ఆపడానికి ప్రయత్నించాను, కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నర పాటు వారు మహిళ మృతదేహాన్ని సుమారు 20 కి.మీ. ఈడ్చుకెళ్లారని చెప్పారు.

కేవలం ప్రమాదం కాదు

తన బైక్‌తో కారును కూడా వెంబడించడంతో పాటు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దహియా చెప్పారు. సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం పడిపోయిందని, ఆ తర్వాత నిందితులు పారిపోయారని చెప్పారు. "ఇది కేవలం ప్రమాదం కాదు" దహియా నొక్కి చెప్పారు.

మరణశిక్ష విధించాలి

ఈ కారు యాక్సిడెంట్ కు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. నిందితులు మృదేహాన్ని ఈడ్చుకెళ్తూ యూటర్న్ తీసుకున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ రోడ్డు ప్రమాదంపై ఢిల్లీ సీఎం క్రేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+