కేజ్రీ వర్సెస్ సిద్దూ: లాలీపప్ ఎత్తుగడలు ఇంకెన్నాళ్లు.. పంజాబ్ ఢిల్లీలా కాదు, డైలాగ్ వార్ కంటిన్యూ

పంజాబ్ ఎన్నికల వేళ అటాక్ కౌంటర్ అటాక్ జరుగుతోంది. వాస్తవానికి ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయి. కానీ ఇప్పటినుంచే నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. సిద్దూ, కేజ్రీవాల్, అమరీందర్ సింగ్ యాక్టివ్‌గా ఉన్నారు. సిద్దూ వర్సెస్ కేజ్రీవాల్ మధ్య అటాక్ పీక్ స్టేజీకి చేరింది. నిన్న సిద్దూ.. కేజ్రీవాల్ ఇంటి ఎదుట గెస్ట్ లెక్చరర్లతో ఆందోళనకు కూడా దిగారు. ఇవాళ విమర్శలకు మరింత పదును పెట్టారు.

అబద్దాల కోరు

అబద్దాల కోరు

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ చీప్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ విమ‌ర్శ‌లు కంటిన్యూ చేస్తున్నారు. కేజ్రివాల్ ఒక అబద్ధాలకోరు అని మండిప‌డ్డారు. ఆయ‌న ఢిల్లీలో ధ‌న‌వంతుల నుంచి అధికంగా ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఆ డ‌బ్బుతో మురికివాడ‌ల్లో క‌రెంటు ఉచితంగా ఇస్తున్నార‌ని కామెంట్ చేశారు. ప్ర‌జ‌ల‌కు ఈ విధ‌మైన లాలీపాప్‌ను నువ్వు ఎన్ని రోజులు అందించ‌గ‌ల‌వు..? అని కేజ్రివాల్‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు.

 లాలీపాప్ ఎత్తుగడలు

లాలీపాప్ ఎత్తుగడలు

పంజాబ్‌లో ఇలాంటి లాలీపాప్ ఎత్తుగ‌డ‌లు ప‌నిచేయ‌వ‌ని సిద్ధూ సెటైర్ వేశారు. పంజాబ్‌లో అధికారంపై దృష్టిపెట్టిన కేజ్రివాల్ త‌ర‌చూ ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌పై హ‌మీల వ‌ర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వ‌స్తే పంజాబ్‌లో 300 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ప్ర‌తి కుటుంబానికి ఉచితంగా క‌రెంట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలో న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ కేజ్రివాల్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

సిద్దూ కూడా..

సిద్దూ కూడా..

ఇటు గత నెలలో మొహాలీలో జరిగిన కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆదివారం ఢిల్లీలో గెస్ట్ టీచర్లు ఆందోళనకు దిగారు. వారితో కలిసి నిరసనలో సిద్దూ పాల్గొన్నారు. కేజ్రీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు కూడా ప్రదర్శించారు. పంజాబ్‌లో ప్రజలను ఆకర్షించడానికి వచ్చే ముందు.. మీ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించుకోవాలని సిద్ధూ సూచించారు. ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి బయట ప్రభుత్వ గెస్ట్‌ టీచర్లు చేశారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో సిద్దూ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో 1031 ప్రభుత్వ పాఠశాలల్లో 196 పాఠశాలల్లో మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. 45 శాతం ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలలను 22 వేల మంది గెస్ట్ టీచర్లు రోజువారీ వేతనాలతో ప్రతి 15 రోజులకు కాంట్రాక్ట్‌ల పునరుద్ధరణతో నడుపుతున్నారని పేర్కొన్నారు.

Recommended Video

    #Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Oneindia Telugu
     అధికారమే పరమావధి

    అధికారమే పరమావధి

    వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ భావిస్తోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరసగా పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. అయితే కేజ్రీవాల్ బలపడితే తమకు నష్టం తప్పదని భావిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. ఆమ్ ఆద్మీ వైపుకి ఓటర్లు మళ్లకుండా చూసే ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఢిల్లీ గెస్ట్ టీచర్లు చేసిన నిరసనలో సిద్ధూ పాల్గొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+