వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా నాన్నను ఎందుకు చంపారో చెప్పండి, ప్లకార్డు పట్టుకొని 12 ఏళ్ళ బాలిక పోస్టు

మా నాన్నను ఎందుకు చంపారంటూ విస్మయ అనే 12 ఏళ్ళ బాలిక ప్ల కార్డు పట్టుకొని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగానే స్పందిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కన్నూర్: మా నాన్నను ఎందుకు చంపారంటూ 12 ఏళ్ళ విస్మయ..... గుర్మెహర్ కౌర్ తరహలో ప్లకార్డు పట్టుకొని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ పై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కేరళకు చెందిన పన్నెండేళ్ళ బాలిక విస్మయ ప్ల కార్డు పట్టుకని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది..కేరళకు చెందిన సంతోష్ కుమార్ అనే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ఈ ఏడాది జనవరిలో హత్యకు గురయ్యారు. సంతోష్ కుమార్ ను తన ఇంట్లోనే హత్య చేశారు.

అయితే తన కళ్ళ ముందే తన తండ్రిని హత్య చేయడంతో విస్మయ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.ఆమె ప్రస్తుతం ఎనమిదో తరగతి చదువుతోంది.తన కళ్ళ ముందే తన తండ్రిని హత్య చేయడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

Kerala: 12-year-old daughter of murdered RSS activist shares video of life post father's death

మా నాన్న నా కలలు నెరవేర్చాలనుకొన్నాడు. ఐపిఎస్ అధికారినై పేద ప్రజలకు సహయం చేయాలన్నారు. నా ఆశయం . కానీ, ఆ కలలు రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకు పోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఆర్ ఎస్ ఎస్ బిజెపికి మద్దతివ్వడమే పాపమా అంటూ ఆమె ప్రశ్నించింది. నా భవిష్యత్తు అంతా చీకటి మయమైపోయిందన్నారు బాధితురాలు.తన ఆశయాలను, కలలను చంపేశారని బాధితురాలు ఆరోపించింది.

తన తండ్రికి ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయానికి ఇంతవరకు జవాబు చెప్పలేదని ఆ బాలిక ప్రశ్నించింది.ఈ మేరకు ప్లకార్డు ద్వారా బాలిక ఆవేదనను వ్యక్తం చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టు కొద్ది నిమిషాల వ్యవధిలోనే 2,500 రిట్వీట్లు, 1500 లైకులు వచ్చాయి. కేరళలో లెఫ్ట్ ,బిజెపి కార్యకర్తల మద్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకొంటున్నాయి.1991 నుండి ఇప్పటివరకు వందకు పైగా మరణించారని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.

English summary
A 12-year-old girl, the daughter of the RSS activist who was hacked to death, allegedly by Leftist workers, has shared a Facebook video that has widely been circulated. Taking a cue from Gurmehar Kaur, the student of Lady Shri Ram College in New Delhi, Vismaya, the 12-year-old from Kerala, communicates her message through placards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X