IRCTC Package:తొలకరి వానల వేళ కొత్తందాల కేరళ.. 14వేలకే చూసొద్దామా!
కేరళ ప్రకృతి సౌందర్యానికి నెలవు. హిల్స్ స్టేషన్స్ మరియు బ్యాక్ వాటర్స్, బీచ్ ప్లేస్ లతో అందమైన ప్రకృతి రమణీయతతో అలరారే కేరళకు గాడ్స్ ఓన్ కంట్రీ అనే గుర్తింపు ఉంది. పచ్చనైన ప్రకృతితో ప్రతి ఒక్కరిని రారమ్మని పిలిచే కేరళ అందాలను చూడాలని చాలామంది కోరుకుంటారు. అటువంటి కేరళలోని సుందరమైన ప్రదేశాలను చూడడానికి ఐఆర్సిటిసి ప్రత్యేకమైన ప్యాకేజీలను తీసుకువచ్చింది.
కేరళలోని అందాలను చుట్టి వచ్చే టూర్ ప్యాకేజీ
కేరళలోని అలెప్పి, మున్నార్ లోని అందాలను చుట్టి రావడం కోసం అవకాశం కల్పిస్తోంది ఐఆర్సిటిసి. 14 వేల రూపాయలతో ప్రారంభమయ్యే అద్భుతమైన టూర్ ప్యాకేజీ ని అందిస్తోంది. ఐదు రాత్రులు, ఆరు రోజుల ఈ ప్యాకేజీలో గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి నుంచి ప్రతి మంగళవారం ట్రైన్ అందుబాటులో ఉంటుంది.
ఈ పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ ఆయా స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంటుంది.

కేరళ టూర్ వెళ్ళాలి అనుకుంటున్నారా?
జూన్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.కేరళ టూర్ వెళ్లాలనుకుంటున్న వారు irctc వెబ్సైట్లోకి వెళ్లి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ప్రయాణానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవడానికి సికింద్రాబాద్ లో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు బయలుదేరి శబరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అంటే..
టూర్ లో అంతా ఐఆర్సిటీసి ప్లాన్ ప్రకారమే
ఇది సికింద్రాబాద్లో ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ నుండి రాత్రంతా ప్రయాణించవలసి ఉంటుంది. రెండో రోజు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు ఎర్నాకులం స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి irctc సిబ్బంది మున్నార్ కు తీసుకువెళ్తారు.అక్కడ ఏర్పాటు చేసినటువంటి హోటల్లో రాత్రికి బస చేస్తారు. తర్వాత రోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్, టి మ్యూజియం, మెట్టు పెట్టి డ్యాం, ఎకో పాయింట్ వీక్షించడం తో ఆరోజు పూర్తవుతుంది.
మున్నార్, అలెప్పీలలో పర్యాటక ప్రాంతాల సందర్శన
మళ్లీ మున్నార్ లోనే బస ఉంటుంది. ఇక నాలుగవ రోజు అక్కడనుండి అలెప్పికి చేరుకుంటారు. ఆ రోజంతా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను సందర్శించడానికి వెళతారు. ఆ రాత్రి కూడా అక్కడే బస చేస్తారు . ఐదవ రోజు అలెప్పీ నుండి ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
శబరి ఎక్స్ ప్రెస్ ప్యాకేజీ లో కేరళ అందాలు చూడండి
మళ్లీ అక్కడ మధ్యాహ్నం 11 గంటల 20 నిమిషాలకు శబరి ఎక్స్ప్రెస్ లో తిరుగు ప్రయాణం అవుతారు. అది తిరిగి ఆరో రోజు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది. మరి ఇంకెందుకాలస్యం భారతీయ రైల్వే అందిస్తున్న ఈ అద్భుతమైన ప్యాకేజ్ లో కేరళలోని అలెప్పీ, మున్నార్ అందాలు చూసి రండి.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications