వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

kerala: అమ్మతోడు ఒక్క ఓటు కూడా పడలేదు, సున్నా ఓట్లతో రికార్డు బ్రేక్, సమయం లేదు మిత్రమా... పారిపో !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ కోజికోడ్/ తిరువనంతపురం: కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్ లీడర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించాడు. తన ప్రధాన ప్రత్యర్థి LDF పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడకుండా చేసిన కరాటే ఫైసల్ మునిసిపాలిటి ఎన్నికల్లో అతని సత్తా నిరూపించుకున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్ స్వప్న ఆంటీ అలియాస్ స్వప్న సురేష్ తో కరాటే ఫైసల్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆయన్ను అధికారులు విచారణ చెయ్యడం, పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడం ఇంతకు ముందే జరిగిపోయాయి.

Kerala: కేరళలో రారాజు ఎవరు, స్థానిక ఎన్నికల కౌంటింగ్, బస్తీమే సవాల్, 2015 రిపీట్ అవుతందా ?, ఎన్డీఏ!Kerala: కేరళలో రారాజు ఎవరు, స్థానిక ఎన్నికల కౌంటింగ్, బస్తీమే సవాల్, 2015 రిపీట్ అవుతందా ?, ఎన్డీఏ!

 ఎవరు ఈ కరాటే ఫైసల్ ?

ఎవరు ఈ కరాటే ఫైసల్ ?

కేరళలోని కోడువళ్లి లో సీపీఎం పార్టీలో కరాట్ ఫైసల్ ఊరమాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా పోటీ చేసిన కరాటే ఫైసల్ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. కోడువళ్లిలో కరాటే ఫైసల్ కు ప్రత్యేక వర్గం, అనుచురులు చాలా మంది ఉన్నారు. మాస్ లీడర్ గా కరాటే ఫైసల్ ఇంతకాలం తన సత్తా చాటుకున్నాడు.

 స్వప్న ఆంటీ ఎఫెక్ట్

స్వప్న ఆంటీ ఎఫెక్ట్

కేరళలో ఇటీవల వెలుగు చూసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేకుండా చేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కింగ్ పిన్ స్వప్న సురేష్ తో పాటు ఐఏఎస్ అధికారి శివశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు. ఇదే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కరాటే ఫైసల్ ను కస్టమ్స్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారణ చేశారు.

 చేతులు ఎత్తేసిన ఎల్ డీఎఫ్

చేతులు ఎత్తేసిన ఎల్ డీఎఫ్

కోడువళ్లి మునిసిపాలిటి ఎన్నికల్లో 15వ వార్డు నుంచి కరాటే ఫైసల్ పోటీ చెయ్యడానికి ప్రయత్నించాడు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే ఫైసల్ కు తాము మద్దతు ఇవ్వమని ఎల్ డీఎఫ్ తేల్చి చెప్పింది. సీపీఎం పార్టీ మద్దతుతో కరాటే ఫైసల్ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా మునిసిపాలిటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎల్ డీఎఫ్ అభ్యర్థిగా అబ్దుల్ రషీద్ పోటీ చేశారు.

 అమ్మతోడు.... దేవుడి మీద ఒట్టు.... ఒక్క ఓటు కూడా రాలేదు

అమ్మతోడు.... దేవుడి మీద ఒట్టు.... ఒక్క ఓటు కూడా రాలేదు

బుధవారం ఎన్నికల ఫలితాలు వెళ్లడించారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కరాటే ఫైసల్ 568 ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించారు. ఇక ముస్లీం లీగ్ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే. ఖాదర్ కు 495 ఓట్లు, ఎన్డీఏ (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేసిన సదాశివన్ కు 50 ఓట్లు వచ్చాయి. ఎల్ డీఎఫ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రషీద్ కు ఏ ఒక్కరు ఓటు వెయ్యకపోవడంతో 0 ఓట్లతో రికార్డులకు ఎక్కాడు.

Recommended Video

Sabarimala : కరోనా నెగిటివ్ ఉంటేనే శబరిమల దర్శనానికి అనుమతి!
 గోవిందా గోవిందా

గోవిందా గోవిందా

కోడువళ్లి మునిసిపాలిటీలోని 36 వార్డులో యూడీఎఫ్ అభ్యర్థులు 13 స్థానాల్లో విజయం సాధించింది. ఎల్ డీఎఫ్ మాత్రం కేవలం 4 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో వివిద పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. కోడువళ్లి మునిసిపాటిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఒకే ఒక వ్యక్తిగా కరాటే ఫైసల్ నిలిచాడు.

English summary
Kerala Civic Polls results 2020: Independent candidate Karat Faisal wins Koduvally muncipality in Kozhikode against LDF candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X