వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ గవర్నర్ ఆరిఫ్‌కు సర్కారు షాక్: ఆ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవి నుంచి తొలగింపు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య దూరం మరింత పెరిగిపోయింది. వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కళామండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గురువారం తొలగించింది.

ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తొలగింపు కోసం కళలు, సాంస్కృతిక రంగంలో ప్రముఖ వర్సిటీ నిబంధనలను మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్థానంలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీని తరువాత, కేరళ ప్రభుత్వం కళామండలం విశ్వవిద్యాలయం ఛాన్సలర్ పదవి నుంచి వర్నర్‌ను తొలగించింది. రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో అగ్రస్థానంలో ఉన్న గవర్నర్‌ను ఇకపై కోరుకోవడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Kerala Drops Governor As Chancellor Of This University Amid Huge Row

వైస్ ఛాన్సలర్ల నియామకంతో సహా విశ్వవిద్యాలయాల పనితీరుపై గవర్నర్, కేరళ ప్రభుత్వానికి మధ్య నిరంతరం విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యంగానే ఉంది. ఇటీవల రాష్ట్రంలోని 11 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. వారి నియామకాన్ని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత వాగ్వాదం ఎంతగా పెరిగిందంటే.. కేరళ కేబినెట్ గవర్నర్‌ను ఛాన్సలర్‌ పదవి నుంచి తప్పించేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చింది పినరయి ప్రభుత్వం.

కేరళ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం , కాలికట్ యూనివర్శిటీ, తునాచత్ ఎజుతచన్ మలయాళ విశ్వవిద్యాలయాలు తమ పదవులకు రాజీనామా చేయాలని కో

English summary
Kerala Drops Governor As Chancellor Of This University Amid Huge Row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X