Kerala Survey: కేరళలో హోరాహోరీ-ఎడ్జ్ ఎవరిదో తేల్చిన మ్యాట్రిజ్ సర్వే..!
దేవుడి భూమిగా పేరున్న దక్షిణాది రాష్ట్రం కేరళ (kerala)లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలపై ఎక్కడా లేని ఉత్కంఠ నెలకొంది. దీనికి ప్రధాన కారణం అక్కడ వరుసగా రెండుసార్లు గెలిచి అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందా లేక విపక్ష యూడీఎఫ్ ఆధిక్యం చాటుకుంటుందా అనే చర్చే ఇందుకు కారణం. తాజాగా ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేరళలో ఓటర్లు ఈసారి ఎవరివైపు మొగ్గుతున్నారనేది తెలుసుకునేందుకు మ్యాట్రిజ్-అయాన్స్ ఒపీనియన్ పోల్ నిర్వహించాయి.
ప్రస్తుతం దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్టం కేరళలో ఈసారి ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమికీ, విపక్ష యూడీఎఫ్ కూటమికీ మధ్య హోరాహోరీ నెలకున్నట్లు తేలింది. అయితే ఇందులో రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇందులో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) 61-71 సీట్లు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) 58-69 సీట్లు , బీజేపీ 2 సీట్లు గెలుచుకోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. అంటే ఎల్పీఎఫ్ కు స్వల్ప మొగ్గు లభిస్తోందన్న మాట.

2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 99 సీట్లు గెలుచుకుంది. యూడీఎఫ్ 41 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మ్యానిఫెస్టో, అభ్యర్ధుల ఎంపిక నుంచీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా తాజా సర్వేలో అధికార ఎల్డీఎఫ్ దే ఎడ్జ్ అని తేలడంతో యూడీఎఫ్ నేతలకు ఇది మింగుడు పడటం లేదు. కేరళలో ఈసారి ఏప్రిల్ 9న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4 ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications