• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళ వరదలు: సాయంలో ఐదు శాటిలైట్ల కీలకపాత్ర, ఎలా పని చేస్తున్నాయంటే?

By Srinivas
|
  ఇకపై కేరళలో వరదలు ఎక్కడ రాబోతున్నాయో కనిపెట్టనున్న శాస్త్రవేత్తలు...!

  తిరువనంతపురం: కేరళను భారీ వరదలు, వర్షాలు కకలావికలం చేశాయి. ఈ వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. కేరళలో రూ.20వేల కోట్ల నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కేరళలో సాధారణ వర్షపాతం కంటే 250 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మొత్తం 80 డ్యాముల్లో సామర్థ్యానికి మించి నీరు చేరింది.

  ఊహించని రీతిలో వరద కారణంగా మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసోచోమ్ నివేదిక ప్రకారం కేరళలో నెలకొన్ని ప్రకృతి వైపరీత్యం ప్రభావంతో కొన్ని నెలల పాటు రాష్ట్రాన్ని భారీ నష్టాలు వెంటాడుతాయి. ప్రత్యేకంగా టూరిజం, వాణిజ్య పంటలు, కొచ్చి పోర్టు సహా పలు నౌకాశ్రయాల నుంచి సాగే అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతినడంతో లక్షలాదిమందిపై ప్రభావం పడనుంది.

  పెద్ద ఎత్తున విరాళాలు

  పెద్ద ఎత్తున విరాళాలు

  కేరళలను వరద ముంచెత్తిన నేపథ్యంలో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. విదేశాలలోని ఉన్న వారు కూడా డబ్బులు పంపిస్తున్నారు. అరబ్ దేశాల్లోని భారత సంతతి వ్యాపారులు రూ.17 కోట్లకు పైగా విరాళాలు అందించారు. యూఏఈలో నివాసం ఉండే కేరళ రాష్ట్రానికి చెందిన బిజినెస్‌మెన్, లులు గ్రూప్ ఎండీ యూసుఫ్ అలీ రూ.5 కోట్లు ఇచ్చారు.

  ఈ ఐదు శాటిలైట్ల సహకారం

  ఈ ఐదు శాటిలైట్ల సహకారం

  ఇదిలా ఉండగా, కేరళలో వరద బాధితులను ఆదుకోవడానికి ఐదు ఇస్రో శాటిలైట్లు కీలకంగా పని చేస్తున్నాయి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు.. ఓసియన్‌శాట్ 2, రిసోర్సెస్‌శాట్ 2, కార్టో‌శాట్ 2, కార్టో‌శాట్ 2ఏ, ఐఎన్ఎస్ఏటీ 3డీఆర్ శాటిలైట్లు ఎప్పటికి అప్పుడు కేరళలోని తాజా పరిస్థితిలపై రియల్ టైమ్ ఇమేజెస్‌ను పంపిస్తున్నాయి. వీటి ద్వారా సాయం చేసేందుకు ఆర్మీకి, ఎన్డీఆర్‌ఎఫ్‌కు అవకాశం లభిస్తోంది.

  అత్యంత కచ్చితత్వంతో సమాచారం ఇస్తున్నాయి

  అత్యంత కచ్చితత్వంతో సమాచారం ఇస్తున్నాయి

  వరదలో చిక్కుకున్న కేరళవాసులను రక్షించేందుకు ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్నాయి. వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడటంలో అధికారులతో పాటు ఇస్రో కూడా పాలుపంచుకుంటోంది. ఐదు శాటిలైట్లు వరద పరిస్థితిపై అధికారులకు అత్యంత కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందిస్తున్నాయి. కేరళలో వరద పరిస్థితితో పాటు అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేయడంలో ఈ ఉపగ్రహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

  శాటిలైట్లు ఇలా సహకరిస్తున్నాయి

  శాటిలైట్లు ఇలా సహకరిస్తున్నాయి

  కేరళలో వర్షం కురిసిన తర్వాత ఎక్కడ వరద వస్తుందో ఈ ఉపగ్రహాల ద్వారా ముందే అలర్ట్స్ పంపిస్తున్నారు. శాటిలైట్లు అందిస్తున్న సమాచారంతో రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ వర్షం పడే అవకాశముందో గుర్తించి అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. కార్టోశాట్ ఉపగ్రహాలు వరద ప్రాంతపు ఫొటోలను హైరెజల్యూషన్ లో తీసి పంపిస్తే, ఇన్ శాట్ 3డీఆర్ ఉపగ్రహం రియల్ టైమ్ ఇమేజింగ్ వ్యవస్థతో పాటు వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ తదితర అంశాలను గుర్తిస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  lok-sabha-home

  English summary
  Even as the unprecedented floods and landslides have devastated most parts of Kerala in the last fortnight, technologically the most helpful support the authorities are getting in handling the situation was updates from Indian Space Research Organisation (Isro) and its various satellites which kept their eyes open up from the atmosphere.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more