కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ఇక లేరు.. పీపుల్స్ లీడర్‌గా గుర్తింపు..!

బెంగళూరు: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తుది శ్వాస విడిచారు. ఆయనకు 79 ఏళ్లు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరణ వార్తను కుమారుడు చాందీ ఊమెన్ ధృవీకరించారు. కేరళ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా పేరుగాంచారు ఊమెన్ చాందీ.

Recommended Video

    Kerala Former CM Oommen Chandy Biography | Telugu OneIndia

    కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఆర్థిక మంత్రి వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించిన ఊమెన్‌ చాందీ కాంగ్రెస్‌లో కూడా పలు కీలక బాధ్యతలు చేపట్టారు.కేరళ రాజకీయాల్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న నాయకులు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో ఊమెన్ చాందీ ఒకరు. ఊమెన్ చాందీ మృతి పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

    Kerala former Chief Minister Oommen Chandy passed away at 79.

    గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని చిన్మయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఊమెన్ చాందీ. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున 4:30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేరళ రాజకీయాల్లో మంచి నాయకుడిగా ముద్ర వేసుకున్న ఊమెన్ చాందీ మృతితో చాలా మంది అభిమానులు, కార్యకర్తలు కన్నీటిపర్యంతం అయ్యారు.

    మొన్నటి వరకు కేరళ రాజకీయాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ పాలుపంచుకుంటూ అవసరమైన సూచనలు చేశారు చాందీ. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, అతను చికిత్స కోసం విదేశాలకు వెళ్ళాడు. ఎలాంటి సంక్షోభం వచ్చినా నవ్వే ముఖంతో ప్రజల ముందుకు వచ్చే నాయకుడిగా ఊమెన్ చాందీ గుర్తింపు పొందారు.

    కేరళ రాజకీయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ చిరునవ్వుతో వాటికి పరిష్కారం కనుగొనే నాయకుడిగా ముద్ర వేసుకున్నారు ఊమెన్ చాందీ.ఆయన ప్రారంభించిన ప్రజా సంబంధాల కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా విని పరిష్కారాలను కనుగొనే కార్యక్రమం ఇది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+