ఎట్టకేలకు 12వ వేతన సంఘం నియామం, కొత్త ఛైర్మన్ గా - టైం ఫిక్స్...!!

ఉద్యోగులకు ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న వేతన సవరణ సంఘం పైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతన సవరణ పైన అధ్యయనం కోసం 12 వ వేతన సంఘం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఛైర్మన్ గా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించారు. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పైన ఉద్యోగుల్లో జోష్ కనిపిస్తోంది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 12వ వేతన సవరణ సంఘం (పిఆర్‌సి)ను ఏర్పాటు చేస్తూ కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధాన కార్యదర్శి విపి జాయ్ ను ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించింది. న్యాయవాది ఎం రాజగోపాలన్‌ నాయర్‌, రిటైర్డ్‌ అదనపు కార్యదర్శి శ్రీలత సుకుమారన్‌ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. గత నెల 29న కేరళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన సమయంలో 12వ పిఆర్‌సి అంశాన్ని ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పిఆర్‌సి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన సిఫార్సులను సమర్పిస్తుంది. మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిషన్‌ను కోరినట్లు బాలగోపాల్‌ సోమవారం తెలిపారు. ఈ సిఫార్సులను సకాలంలో అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

kerala-government-announces12th-pay-revision-commission-to-study-the-revision-of-salaries-of-employe

కాగా, రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి విఆర్‌ శోభ ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరించేలా ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 'ఐదు సంవత్సరాల సూత్రాన్ని అనుసరించడం వామపక్షాల ప్రభుత్వాల విధానం' అని మంత్రి బాలగోపాల్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు. 11వ పిఆర్‌సి సిఫార్సులను అమలు చేసినందుకు కేరళ ప్రభుత్వంపై రూ.25 వేల కోట్ల అదనపు భారం పడిందని మంత్రి గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ కు మూడు నెలల గడువుగా కేటాయించారు. కాగా.. ఏప్రిల్ లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో.. ఎన్నికల్లోగా కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత మాత్రమే పీఆర్సీ నివేదిక అమలు పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+