మళ్లీ విజృంభిస్తున్న కరోనా - భారీగా కేసులు, అప్రమత్తం..!!
కరోనా మరోసారి విజృంభిస్తోంది. క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతోంది. చైనా, సింగపూర్, ఇండోనేషియాలో పెరిగిన కేసుల తో కేంద్రం అప్రమత్తమైంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని తేల్చి చెప్పింది. భారత్ తో మహారాష్ట్రతో పాటుగా కేరళలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళ లో ఈ నెలలోనే భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో, రద్దీ ప్రాంతాల్లో మాస్కు లు ధరించటం మంచిదని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
మరోసారి కరోనా మహమ్మారి కేరళలో విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండ టంతో ఆ రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఒక్క మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ వివరించారు.

మరోవైపు మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల్లో ఇద్దరు మరణించి ట్లు నిన్న ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించించింది. రణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది. జనవరి నుంచి మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్లు చేయగా, 106 కేసులు పాజిటివ్ తెలినట్లు చెప్పింది. వీరిలో 101 మంది ముంబయికి చెందిన వారు కాగా, మిగిలిన వారు పుణె, థానే, కొల్హాపుర్ చెందినవారుగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నట్లు, వారిలో 16మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అందోళన లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications