ఫేస్‌బుక్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్ట్, ఉద్రిక్తత

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫేస్‌బుక్‌లో దివంగత సీపీఎం నేత ఏకే గోపాలన్‌పై చేసిన పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

శుక్రవారం తన ఫేస్‌బుక్‌లో బలరామ్‌ ఇలా పోస్టు చేశారు. ఏకే గోపాలన్‌ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు.

ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్‌పై వేధింపులకు పాల్పడినట్లేనని బలరామ్ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్‌పై సోషల్‌ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫేస్‌బుక్ పోస్టు‌పై సీపీఎం తీవ్రంగా మండిపడింది.

Kerala MLA Balram's office vandalised after Facebook post on AKG's marriage sparks row

డివైఎఫ్ఐ కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడి చేశారు.మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది.

ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోని బలరామ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలన్‌ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది? అని బలరామ్‌ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Congress leader's remarks led to widespread condemnation on social media with many alleging that Balram called Gopalan a 'child molester'.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి