చర్చి ఫాదర్ పాడుబుద్ధి.. బైబిల్ స్టడీకి వచ్చిన బాలికపై..
కేరళలో ఓ చర్చి ఫాదర్ చేయ్యకూడని పని చేశాడు. బైబిల్ స్టడీ కోసం వచ్చే బాలికపై ఎవరూ లేని సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫాదర్ ని అరెస్టు చేశారు.
తిరువనంతపురం: కేరళలో ఓ చర్చి ఫాదర్ చేయ్యకూడని పని చేశాడు. బైబిల్ స్టడీ కోసం వచ్చే బాలికపై ఎవరూ లేని సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫాదర్ ని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. దేవరాజ్(65) తిరువనంతపురంలోని ఓ చర్చిలో ఫాదర్ గా పనిచేస్తున్నాడు. ఆ చర్చికి ఓ బాలిక(10) బైబిల్ స్టడీ సమయంలో వస్తూ ఉంటుంది. తిరిగి ఆ బాలికను రోజూ ఆమె తండ్రి వచ్చి తీసుకెళుతూ ఉంటాడు.

ఆదివారం కూడా ఆ బాలిక బైబిల్ స్టడీ సెషన్ కోసం చర్చికి వచ్చింది. సెషన్ పూర్తయిన తరువాత కుమార్తెను తీసుకెళదామని చర్చికి వచ్చిన ఆమె తండ్రికి పడకూడని దృశ్యం కంటపడింది.
చర్చి ఫాదర్ దేవరాజ్ తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడడం చూసిన ఆ బాలిక తండ్రి వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి విషయాన్ని వివరించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాదర్ దేవరాజ్ ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications