కేరళలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం: ఇద్దరు మృతి, భారీగా పెరిగిన కేసులు
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కనుమరుగైందని అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కేసులు కేరళలో రాష్ట్రంలో పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఒక్కసారిగా 19 కరోనా కేసులు పెరిగాయి. అంతేగాక, కోవిడ్ 19 కారణంగా రెండు మరణాలు కూడా సంభవించాయి.
అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో నవంబర్ నెలలో 470 కేసులు ఉండగా.. డిసెంబర్ మొదటి పది రోజుల్లోనే 825 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. భారతదేశంలో అత్యధికంగా కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. శ్వాస సంబందిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగులలో కోవిడ్ కేసులు కొనుగొనబడ్డాయని వైద్యాధికారులు తెలిపారు.

ఒమిక్రాన్ జేఎన్1 సబ్ వేరియంట్‌ని దక్షిణాది రాష్ట్రం గుర్తించినట్లు నివేదికలు ఉన్నప్పటికీ.. వైరస్ పై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం ఆంక్షలు, నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం లేదా ఇన్సాకోగ్ నుంచి వచ్చిన జేఎన్.1 వేరియంట్ ఉనికిని కేరళలో నిర్ధారించింది తాజా డేటా. ప్రస్తుతం సింగపూర్, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఈ తరహా కరోనా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదట లక్సెంబర్గ్‌లో ఆగస్టు నెలలో మొదట ఈ వేరియంట్ ను గుర్తించారు. పిరోలా వేరియంట్ అని కూడా పిలువబడే బీఏ.2.86 ను ఈ ఏడాది జులైలో డెన్మార్క్ దేశంలో మొదటిసారి కొనుగొన్నారు.
కాగా, భారతదేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోనే ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంఖాల ప్రకారం.. శుక్రవవారం దేశంలో 237 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1296కి పెరిగింది. మరనాల సంఖ్య 5,33,310గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,03,830గా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,69,536కు పెరిగింది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
వాతావరణ కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా కోవిడ్ లక్షణాలు తీవ్రమవుతున్నాయని స్టేట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సన్నీ పీ ఒరాథెల్ తెలిపారు. అంటువ్యాధుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఎక్కువ మంది రోగులలో కేసులు తీవ్రంగా లేవని, మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు. అయితే, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, తక్కువ నిరోధక శక్తి ఉన్నవారికి ఎక్కువ హాని కలిగిస్తుందని చెబుతున్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications