వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ ప్రమాదంపై అనుమానాలు, గుడి వద్ద 3 కార్లలో పేలుడు పదార్థాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని పుట్టంగళ్ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 109కి పెరిగింది. అయితే, ఈ ప్రమాదంపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. సోమవారం నాడు ఉదయం పేలుడు పదార్థాలతో నిండిన మూడు కార్లను పోలీసులు ఆలయం సమీపంలో గుర్తించారు.

ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ మూడు కార్లు అక్కడే ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారు. వాటి నిండా బాంబులు తదితర పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బాంబ్ స్క్వాడ్ బృందానికి సమాచారం ఇచ్చారు. వాటిని నిర్వీర్యం చేస్తున్నారు.

/news/india/kerala-temple-fire-3-abandoned-cars-with-firecrackers-found-175801.html

మూడు కార్లలో పైర్ క్రాకర్స్ దొరకడంపై ప్రమాదం విషయమై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం వెనుక విద్రోహ కోణం దాగి ఉండవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదానికి బాణసంచా అంటుకోవడం ఓ కారణమైనప్పటికీ, బాంబు పేలుళ్లు కూడా సంభవించి ఉండవచ్చన్న అనుమానాలతో అధికారులు సోదాలను ముమ్మరం చేశారు.

మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి ఐదుగురు ఆలయ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కేరళలోని కొల్లంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనపై భారత సంతతికి చెందిన ఓ బ్రిటన్‌ ఎంపీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని ఇండో-బ్రిటిష్‌ ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌ అధ్యక్షుడు, బ్రిటన్‌ ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బ్రిటిష్‌ లేబర్‌ పార్టీకి చెందిన వీరేంద్ర శర్మ ఈలింగ్‌ సౌతాల్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

English summary
Three abandoned cars with fireworks have been seized by the Kerala police. The three cars were found abandoned near the Puttingal temple where a major accident took place in which over 100 people died and nearly 380 persons were injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X