viral video:వావ్.. రోషిణి, నాగుపామునే పట్టేసి, చుట్టేసి.. నెటిజన్ల ప్రశంసలు

పాము కనిపించిందంటే చాలు ఆమడదూరం పారిపోతం.. ఇక నాగుపాము.. నల్ల త్రాచు అయితే గుండె గుబేల్ మంటోంది. అవును ఎవరో కొందరు తప్పించి ధైర్యం చేసే వారు చాలా అరుదు.. కానీ అటవీశాఖలో పనిచేసేవారు మాత్రం తప్పనిసరిగా అలర్ట్‌గా ఉండాలి. పాములు, జంతువులు అంటే అప్రమత్తత కంపల్సరీ.. కానీ వారిలో కూడా చాలా మంది పూర్తి అంకితభావంతో పనిచేసేవారు తక్కువగా ఉంటారు. కానీ అటవీశాఖ అధికారి రోషిణి మాత్రం అలా కాదు.

ఇళ్లలోకి దూరిన త్రాచు పాము

ఇళ్లలోకి దూరిన త్రాచు పాము

కేరళను దైవభూమి అంటారు. ఇక్కడ కొబ్బరి చెట్లు, ప్రకృతి చీరకట్టినట్టు బాగుంటుంది. సో.. పాములు కూడా ఎక్కువే.. అవీ ఇళ్లలోకి దూరడం సహజమే.. తిరువనంతపురంలో గల కట్టకడలో గల ఓ ఇంటిలోకి నల్ల త్రాచు దూరింది. వెంటనే అక్కడున్న వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకేముంది రోషిణి రంగంలోకి దిగారు. ఈమె ఏం చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఆమె దానిని అందులో వేసి పట్టడంతో.. అక్కడున్న వారంతా నోటిలో వేలు పెట్టుకొని మరీ చూశారు. వామ్మో ఇదేంటి అని అంతా అనుకున్నారు. తాము చూసేది నిజమేనా అని ఫీలయ్యారు.

తోక పట్టుకున్న రోషిణి

త్రాచు పాము తోకను రోషిణి పట్టుకున్నారు. అదీ పడగ తీయగా.. తన వద్ద గల స్టిక్‌తో మెల్లగా దానిని ఆడించారు. పక్కనే సంచి రెడీగా ఉంచుకున్నారు. తొలుత దాని తల.. తర్వాత నడుము నుంచి తోక వరకు అందులో వేసి.. ముడి వేశారు. అక్కడ ఏం జరుగుతుందో.. చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆ పాము కూడా చాలా పెద్దగా ఉంది. హమ్మయ్యా అనుకుంటూ అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము ఉన్నంతసేపు మాత్రం వారి పై ప్రాణాలు పైనే పోయాయి.

ప్రత్యేకంగా శిక్షణ

ప్రత్యేకంగా శిక్షణ

రోషిణి.. పాములు పట్టడంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అందుకే భయపడకుండా దానిని పట్టుకున్నారు. అంతేకాదు రోషణి చేసిన ధైర్యాన్ని మిగతా వారికి ఆదర్శంగా నిలువనుంది. అటవీశాఖలోకి మహిళలు వచ్చే అవకాశం ఉంది. రోషిణి పాము పట్టే వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామన్ షేర్ చేశారు. ఇంటర్నెట్ రోషిణిని ఇంటర్నెట్ ప్రశంసలతో ముంచెత్తింది. వావ్ అంటూ కొనియాడింది.

ప్రశంసించిన నెటిజన్లు

ప్రశంసించిన నెటిజన్లు

గతంలో తాను ఇలాంటి ఘటన చూడలేదని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. రోషిని చాలా మంచి పనిచేశారని కొనియాడారు. ఆమె ధైర్మ సాహసాలు సూపర్.. మంచి శిక్షణ తీసుకున్నారని మరొకరు కామెంట్ చేశారు. మెజార్టీ పీపుల్ రోషిణిని కీర్తించారు. ఆమె చేసిన పని వల్ల.. అక్కడున్న వారు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. మంచి ధైర్య సాహసం ఉన్న అధికారి అంటూ కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+