Keralam poll Survey: కేరళలో గెలిచేది వారే..! తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!
కేరళం(కేరళ) అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు (kerala Elections) జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఈసారి అక్కడ రెగ్యులర్ గా పోటీ పడే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కి తోడు ఎన్డీయే కూడా బరిలో ఉండటమే. దీంతో ఈ ముగ్గురి మధ్య రేసులో ఎవరు గెలువబోతున్నారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఓటర్ల నాడి ఎలా ఉందన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో లోక్ పోల్ సంస్థ తమ తాజా సర్వే ఫలితాలను వెల్లడించింది.
కేరళలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ లేదా కూటమికి ఎడ్జ్ ఉంది, ఎన్ని సీట్లు సాధించబోతున్నారు, ఓట్ల శాతం ఎలా ఉండబోతోందన్న అంశాలపై లోక్ పోల్ తమ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇందులో అధికార ఎల్డీఎఫ్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తప్పడం లేదు. ఇక్కడ విపక్ష యూడీఎఫ్ ఈసారి అధికారంలోకి రాబోతున్నట్లు తేలింది. అలాగే ఎన్డీయే ప్రభావం ఏమాత్రం లేదని కూడా లోక్ పోల్ సర్వే తేల్చేసింది.

Presenting our mega pre-poll projections for the poll-bound state of #Keralam, based on our ground survey conducted from February 9 to 24.
— Lok Poll (@LokPoll) February 27, 2026
▪️ LDF 51 - 59 | 39-42%
▪️ UDF 81 - 86 | 43-45%
▪️ NDA 0 - 2 | 13 - 25%
Sample size: 42,000, 300/… pic.twitter.com/TSzj1pzOe4
140 సీట్లు ఉన్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమికి అత్యధికంగా 81 నుంచి 86 సీట్లు వస్తాయని లోక్ పోల్ అంచనా వేస్తోంది. అలాగే అధికార ఎల్డీఎఫ్ కూటమి కేవలం 51 నుంచి 59 సీట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ఎన్డీయేకు 0 నుంచి 2 సీట్లు రావొచ్చని తెలిపింది. అలాగే యూడీఎఫ్ మొత్తం ఓట్లలో 43 నుంచి 45 శాతం ఓట్లు సంపాదిస్తుందని, ఎల్డీఎఫ్ 39 నుంచి 41 శాతం ఓట్లను, ఎన్డీయే కేవలం 13 నుంచి 15 శాతం ఓట్లను సాధిస్తాయని లోక్ పోల్ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి 24వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు లోక్ పోల్ సంస్ధ తెలిపింది.
ఉత్తర, మధ్య కేరళలో యూడిఎఫ్ ఆధిక్యంలో ఉండగా.. దక్షిణాదిలో ఎల్డిఎఫ్ తన స్థానాన్ని నిలుపుకుంటోందని సర్వే తెలిపింది. అలాగే శబరిమల, సంబంధిత సమస్యలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని తెలిపింది. క్రైస్తవ ఓటు బ్యాంకు ఇప్పటికీ యూడీఎఫ్ తోనే ఉందని తేల్చింది. అలాగే ముస్లిం సమాజం దాదాపుగా ముస్లింలీగ్ వైపే ఉందని తెలిపింది. వరి రైతులు, మత్స్యకారులు, ప్రభుత్వ ఉద్యోగులలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications