నాన్ వెజ్ బ్యాన్.. గవర్నర్ షాకింగ్ ఆర్డర్స్! ఛార్జ్ తీసుకోగానే రాజుకున్న వివాదం

బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కేరళ గవర్నర్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుపాను రేపింది. లోక్ భవన్ వంటగది పూర్తిగా శాకాహారంగా మెలగాలంటూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు అగ్గి రాజేశాయి. కేరళ సాంప్రదాయాలు, ప్రజల ఆహారపు అలవాట్లకు ఇది విరుద్ధమంటూ అధికార, విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వ్యక్తిగత రుచులను వ్యవస్థపై రుద్దడం తగదంటూ రాజకీయ నాయకులు ధ్వజమెత్తుతుండటంతో ఈ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రాష్ట్ర 29వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ మాధుర్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ఈ వివాదం తెరపైకి వచ్చింది. లోక్ భవన్ అధికారిక వంటగదిలో ఇకపై ఎలాంటి మాంసాహార వంటకాలు తయారు చేయకూడదని, వడ్డించకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తాను కరడుగట్టిన శాకాహారినని, వ్యక్తిగత కారణాల వల్లే ఈ మార్పులు కోరినట్లు గవర్నర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే లోక్ భవన్ సిబ్బంది ఎవరి ఆహారపు అలవాట్లను తాము నియంత్రించడం లేదని, ఎవరికి నచ్చింది వారు తినొచ్చని వారు వివరణ ఇచ్చారు.

Keralam Governor Veg Only Kitchen Diktat Sparks Massive Political Row Between Ruling Congress And CPIM
Suicide Tree: మామిడి కాదు మృత్యువు. చావును మోస్తున్న ఓతలంగ చెట్టు
Suicide Tree: మామిడి కాదు మృత్యువు. చావును మోస్తున్న ఓతలంగ చెట్టు

సంఘ్‌ పరివార్‌ అజెండాపై విమర్శలు

గవర్నర్ నిర్ణయం వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. కేరళ ఒక తీర ప్రాంత రాష్ట్రమని, ఇక్కడ విభిన్నమైన ఆహార సంస్కృతి ఉంటుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ప్రజల ఇష్టాలను శాసించే హక్కు ఎవరికీ లేదని, ప్రాథమిక హక్కులను ఇది హరించడమేనని అన్నారు. ఇది కేరళలో కాషాయ అజెండా అమలు చేయడానికి వేస్తున్న తొలి అడుగు అని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఏది తినాలనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని, ఇతరుల ఆహారంపై ఆంక్షలు విధించడం తప్పు అని హోంమంత్రి రమేష్ చెన్నితాలా మండిపడ్డారు.

కమ్యూనిస్ట్ పార్టీల ఆగ్రహం

శాకాహార నిబంధనలపై సీపీఎం కూడా తీవ్రంగా స్పందించింది. భారత్‌లో శాకాహార లేదా మాంసాహారాన్ని ఎంచుకునే ప్రజాస్వామ్య హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ గుర్తుచేశారు. ఈ హక్కులను కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆహారాన్ని కూడా మతపరమైన ఆయుధంగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు.

జగన్ బిగ్ స్టెప్- గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు
జగన్ బిగ్ స్టెప్- గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు

స్పష్టత నిచ్చిన లోక్ భవన్ వర్గాలు

గవర్నర్‌కు వంట చేసే వంటగదిలో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. గవర్నర్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొద్దిమంది మాత్రమే ఇక్కడ భోజనం చేస్తారని తెలిపాయి. మిగతా ఉద్యోగులు ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తెచ్చుకోవచ్చని, ఇతరులపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. గతంలో కొంతమంది గవర్నర్ల హయాంలో లోక్ భవన్‌లో మాంసాహార వంటకాలు తయారైనప్పటికీ, కొత్త గవర్నర్ వ్యక్తిగత నిబంధనల కారణంగా ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+