ఈ చేప బయటకి వస్తే భూకంపమే? ప్రళయానికి సంకేతమంటూ ప్రచారం
సముద్రం గర్భంలో దాగి ఉండే వింత జీవులు ఒక్కసారిగా ఒడ్డుకు చేరితే.. మానవాళికి రాబోయే ప్రమాదాలకు అవే సంకేతాలంటూ పురాతన కాలం నుంచి ప్రచారంలో ఉన్న నమ్మకాలు మరోసారి ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భూమిపై పెను విలయం ముంచుకొస్తుందనడానికి ఇవి సంకేతాలనే భయంతో జనాలు వణికిపోతున్నారు. సరిగ్గా అలాంటి భయాలనే నిజం చేస్తూ, తాజాగా చిలీ దేశంలోని సముద్ర తీరంలో ప్రత్యక్షమైన ఒక భారీ అరుదైన చేప ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. భూకంపాలు, సునామీల రాకను ఇది ముందే పసిగట్టి బయటకు వస్తుందనే నమ్మకం ప్రజల్లో తీవ్ర కలవరం సృష్టిస్తోంది.
తీరానికి కొట్టుకొచ్చిన రాక్షస చేప
చిలీ దేశంలోని సముద్ర తీరంలో సుమారు 16 అడుగుల పొడవున్న ఒక అరుదైన 'ఓర్‌ఫిష్' (Oarfish) మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సముద్రపు అడుగుభాగంలో, ఏకంగా మూడు వేల అడుగుల అతి లోతైన జలాల్లో నివసించే ఈ వింత చేపలు సాధారణంగా ఎప్పటికీ నీటి ఉపరితలానికి రావు. ఇవి చూడటానికి పాములా భయానకంగా ఉంటాయి. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ చేపలు కంటికి కనిపించిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. చివరికి కాలిఫోర్నియాలో గత వంద సంవత్సరాలలో కేవలం 19 సార్లు మాత్రమే ఇవి కనిపించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

భూకంపాల భయంతో వణికిపోతున్న జనం
ఈ డూమ్‌డే ఫిష్ ప్రత్యక్షం కావడంతో చిలీ దేశంలో భారీ భూకంపాలు రాబోతున్నాయంటూ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో దక్షిణ అమెరికా, కరేబియన్ ప్రాంతాలు వరుస భూకంపాలతో అతలాకుతలమైన నేపథ్యంలో ఈ తాజా ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది నెలలుగా కొలంబియా, వెనిజులా దేశాల్లో తీవ్రమైన భూకంపాలు సంభవించగా, పెరూ, చిలీ దేశాలు కూడా ప్రకంపనలను ఎదుర్కొన్నాయి. రాబోయే కాలంలో అమెరికా పశ్చిమ తీరంలోనూ భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందని జియోఫిజిస్ట్ స్టీఫెన్ బర్న్స్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ చేప ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో "మళ్లీ భూకంపం" అంటూ ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో జరిగిన వినాశకర పరిణామాలు
ఈ ఓర్‌ఫిష్‌లను కేవలం మూఢనమ్మకాలుగా శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నప్పటికీ, గతంలో ఇవి కనిపించిన కొన్ని సందర్భాల్లో నిజంగానే ప్రకృతి విపత్తులు సంభవించడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు 25న ఇండోనేషియా తీరంలో ఒక డూమ్‌డే ఫిష్ కొట్టుకురాగా, సరిగ్గా ఆరు రోజుల తర్వాత అక్కడ వరుసగా ఆరు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి.
అలాగే ఫిబ్రవరిలో మెక్సికో తీరంలో రెండు సజీవ ఓర్‌ఫిష్‌లు కనిపించగా, మార్చి నెలలో ఆ ప్రాంతానికి సమీపంలోనే భారీ భూకంపం నమోదైంది. అంతేకాకుండా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక భీకర తుపానులు ఆ ప్రాంతాన్ని వణికించాయి.
కేవలం 2025 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా మెక్సికో, భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీర ప్రాంతాల్లో దాదాపు ఆరు ఓర్‌ఫిష్‌లు కంటపడటం గమనార్హం. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఈ వింత చేపల రాక మాత్రం మానవాళిని నిరంతరం భయపెడుతూనే ఉంది.














Click it and Unblock the Notifications
