Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంపీ భార్య, మిసెస్ కేరళకు లైంగిక వేధింపులు, ఎమ్మెల్యే కొడుకు, పరువునష్టం దావా, రివర్స్ !

తిరువనంతపురం: కేరళలో ఓ ప్రముఖురాలు లైంగిక వేధింపులకు గురైయ్యిందని వెలుగు చూసింది. ప్రముఖ రాజకీయ నాయకుడి కోడలు, ఎంపీ భార్య, మిసెస్ కేరళ అయిన నిశా జోస్ తాను లైంగిక వేధింపులకు గురైనానని స్వయంగా ఆమె జీవిత చరిత్ర పుస్తకంలో రాయడంతో ఇప్పుడు కేరళ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి.

కేరళ కాంగ్రెస్

కేరళ కాంగ్రెస్

కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కేఎం. మణి కుమారుడు, ఎంపీ అయిన జోస్ మణి భార్య నిశా జోస్ తాను 2016 అక్టోబర్ లో తిరువనంతపురంలో రైల్లో లైంగికవేధింపులకు గురైనానని ఆరోపించారు. దేశంలో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని నిశా జోస్ అంటున్నారు.

 జీవిత చరిత్ర

జీవిత చరిత్ర

ఎంపీ జోస్ మణి సతీమణి నిశా జోస్ ఆమె జీవిత కథ ఆధారంగా The Other Side of This Life అనే పుస్తకం రాశారు. అందులోనే తన జీవితంలో జరిగిన సంఘటన గురించి నిశా జోస్ వివరించారు.

 కాలు పట్టుకున్నాడు

కాలు పట్టుకున్నాడు

2016 ఆగస్టులో తాను తిరువనంతపురం నుంచి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు తన కాలును మూడునాలుగు సార్లు పట్టుకున్నాడని నిశా జోస్ ఆరోపించారు. అయితే అది ఆకస్మికంగా పట్టుకున్నట్లు లేదని, కావాలనే పట్టుకున్నట్లు ఉందని నిశా జోస్ వివరించారు.

పేరు, వివరాలు

పేరు, వివరాలు

అయితే తనను లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరు, వివరాలు మాత్రం వెళ్లడించలేదు. ఓ ఎమ్మెల్యే కుమారుడు, యూడీఎఫ్ పార్టీకి చెందిన వ్యక్తి తనను లైంగికవేధింపులకు గురి చేశాడని మాత్రం క్లూ ఇచ్చారు. ఆ సమయంలో ఇంటికి వెళ్లి జరిగిన విషయం తన భర్త జోస్ మణికి, కుటుంబ సభ్యులకు చెప్పానని నిశా జోస్ వివరించారు.

పరువునష్టం దావా

పరువునష్టం దావా

నిశా జోస్ తనను లైంగికవేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరు వివరాలు చెప్పకపోయినా కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ కుమారుడు శాన్ జార్జ్ మాత్రం కోర్టును ఆశ్రయించాడు. తనను ఉద్దేశించి రాజకీయ లబ్దికోసం నిశా జోస్ ఆరోపణలు చేసి తన కుటుంభాన్ని అప్రతిష్టపాలు చెయ్యాలని చూస్తున్నారని ఆమె మీద శాన్ జార్జ్ పరువునష్టం దావా వేశాడు.

మిసెస్ కేరళ

మిసెస్ కేరళ

కేరళ ఎంపీ జోస్ మణి సతీమణి నిశా జోస్ ఒక్కసారి కేరళ మిసెస్ గా ఎంపిక అయ్యారు. నిశా జోస్ లైంగికవేధింపుల ఆరోపణలు, ఎమ్మెల్యే పీసీ. జార్జ్ కుమారుడు శాన్ జార్జ్ కోర్టుకు వెళ్లడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+