ఫ్లైట్ క్రాష్‌లో కీలక పరిణామం..బ్లాక్ బాక్స్ లభ్యం
అహ్మదాబాద్‌లో 241 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ బ్లాక్ బాక్స్ శుక్రవారం ధ్వంసమైన భవనం పైకప్పు నుంచి లభ్యమైనట్లు అధికారులు ధృవీకరించారు.
గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కుప్పకూలింది. మెఘానినగర్‌లోని హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్న ఈ విమానంలో కేవలం ఒక బ్రిటిష్-భారతీయ వ్యాపారవేత్త మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా విమానం అకస్మాత్తుగా ఎందుకు దిగింది, దానికి దారితీసిన సాంకేతిక వైఫల్యం, మానవ తప్పిదం లేదా ఇతర కారకాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై కీలక ఆధారాలు లభిస్తాయని దర్యాప్తు అధికారులు ఆశిస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన సింగిల్-ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications