సినీ ఫక్కీలో 100 కార్లతో ఛేజింగ్
పోలీసులు 100 కార్లతో సినీ ఫక్కీలో ఛేజ్ చేసి ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు.
ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. 100 కార్లతో ఛేజ్ చేసి మరీ అతడిని అదుపులోకి తీసుకున్నారు. అమృత్ పాల్ సింగ్ తోపాటు ఆరుగురు మద్దతుదారులను కూడా అరెస్టు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఓ కిడ్నాప్ కేసులో ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 24న అమృత్‌పాల్ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగారు. నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు మరో దారిలేక లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదు చేశారు. జీ-20 సదస్సు దృష్ట్యా ఇన్నాళ్లూ అతడిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

జీ-20 సదస్సు ముగిసన మరుసటి రోజే అమృత్‌పాల్ అరెస్టుకు పోలీసులు వ్యూహాన్ని అమలు చేశారు. జలంధర్‌లోని షాకోట్‌కు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. పక్కా ప్రణాళిక ప్రకారం అమృత్‌పాల్, అతడి అనుచరులను పోలీసులు చుట్టుముట్టారు. పారిపోయేందుకు ప్రయత్నం చేయగా ప్రత్యేక పోలీసుల బృందం 100 కార్లలో అతడిని ఛేజ్ చేసింది. జిల్లా సరిహద్దులను మూసేయడంతోపాటు కొన్ని గంటల పాటు అతణ్ని వెంబడించి చివరకు అదుపులోకి తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు అతడి అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన కూడావ విడుదల చేయలేదు.












Click it and Unblock the Notifications