Housewife: మరిది, తోడుకోడలు, కూతురు, అత్తను అడ్డంగా నరికి చంపేసింది. భార్య హత్యలు చేస్తుంటే భర్త ? !
కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: అన్నదమ్ములు పెళ్లి చేసుకుని వారి భార్యలు, పిల్లలు, కన్నతల్లితో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల ఉమ్మడి కాపురం చాలా సంతోషంగానే సాగిపోయింది. రానురాను భార్యల కారణంగా అన్నదమ్ములకు గొడవలు మొదలైనాయి. ఇంట్లోనే ఉంటున్న కన్నతల్లి అన్నదమ్ములకు, ఇద్దరు కోడళ్లకు సర్దిచెబుతూ వస్తోంది. అయితే పరిస్థితులు చెయ్యిదాటిపోయాయి. ఒకే ఇంటిలో ఉంటున్నా అన్నదమ్ముల కుటుంబాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. సహనం కోల్పోయిన మహిళ ఆమె భర్త సోదరుడితో పాటు అతని భార్య, కూతురిని దారుణంగా హత్య చేసింది. అడ్డుపడిన అత్తను కూడా దారుణంగా చంపేసింది. నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేస్తున్న భార్యకు ఆమె భర్త కూడా సహకరించడం కలకలం రేపింది.

అన్నదమ్ముల కాపురం
పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో దేబ్రాజ్ ఘోష్, దేబాశిష్ ఘోష్ (36) అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. దేబ్రాజ్ ఘోష్ పల్లబి ఘోష్ అనే మహిళను, అతని సోదరుడు దేబాశిష్ ఘోష్ రేఖా ఘోష్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. అన్నదమ్ములు దేబ్రాజ్ ఘోష్, దేబాశిష్ ఘోష్ పెళ్లి చేసుకున్న తరువాత వారి భార్యలు, పిల్లలు, కన్నతల్లి మినాతి ఘోష్ (55)తో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు.

తోడుకోడళ్ల గొడవతో ?
కొన్ని సంవత్సరాల ఉమ్మడి కాపురం చాలా సంతోషంగానే సాగిపోయింది. రానురాను పల్లబి ఘోష్, ఆమె తోడు కోడలు రేఖాల కారణంగా అన్నదమ్ములు దేబ్రాజ్ ఘోష్, దేబాశిష్ ఘోష్ ల మద్య గొడవలు మొదలైనాయి. ఇంట్లోనే ఉంటున్న కన్నతల్లి మినాతి ఘోష్ ఆమె కొడుకులు దేబ్రాజ్, దేబాశిష్ లకు ఇద్దరు కోడళ్లు రేఖా, పల్లబికి సర్దిచెబుతూ వస్తోంది. అయితే పరిస్థితులు ఇటీవల కాలంలో చెయ్యిదాటిపోయాయి.

భార్య నరికి చంపుతుంటే భర్త ఏం చేశాడంటే ?
ఒకే ఇంటిలో ఉంటున్నా అన్నదమ్ములు దేబ్రాజ్, దేబాశిష్ ల కుటుంబాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. సహనం కోల్పోయిన పల్లబి ఘోష్ ఆమె భర్త సోదరుడు దేబాశిష్ ఘోష్, అతని భార్య రేఖా, వాళ్ల కూతురు తియాషా ఘోష్ (13) అనే ముగ్గురిని రూమ్ లో నుంచి బయటకు వెళ్లకుండా చేసి కొడవలితో దారుణంగా నరికేసింది. భార్య పల్లబి ఘోష్ సోదరుడు, మరదలు, కూతురిని నరకుతుంటే వాళ్లు బయటకు వెళ్లకుండా దేబ్రాజ్ ఘోష్ వాళ్లను అడ్డుకున్నాడు.

అత్తను కూడా వదలకుండా చంపేసింది
కొడుకు, కోడలు, మనుమరాలు కేకలు వేస్తున్న విషయం గుర్తించిన మినాతి ఘోష్ రూమ్ లోకి వెళ్లి మరో కోడలు పల్లబి ఘోష్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన పల్లబి ఘోష్ అదే కొడవలితో అత్త మినాతి ఘోష్ ను నరికేసింది. ఆ సందర్బంలో మినాతి ఘోష్ గట్టిగా కేకలు వేసింది.
Recommended Video


చిక్కిపోయిన కిలాడీ కోడలు.... కొడుకు ఎస్కేప్
మినాతి ఘోష్ కేకలు వెయ్యడంతో స్థానికులు ఆ ఇంటి దగ్గరకు వెళ్లి పల్లబి ఘోష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జరిగిన విషయం స్థానికులకు చెప్పినా మినాతి ఘోష్ ఆంబులెన్స్ వచ్చేలోపు ఆమె ప్రాణాలు వదిలేసింది. పల్లబి ఘోష్ చిక్కిపోవడంతో ఆమె భర్త బేద్రాష్ ఘోష్ హత్యకు ఉపయోగించిన రెండు కొడవళ్లు ఎత్తుకుని సంఘటనా స్థలం నుంచి తప్పించుకుని పారిపోయాడని పోలీసులు అన్నారు. ఒకే కుటుంబంలో నలుగురిని వివాహిత మహిళ హత్య చెయ్యడం హౌరాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications