Khiladi: ఆన్ లైన్ లో ఐఫోన్ ఆర్డర్, డెలవరీ బాయ్ ని ఇంట్లోకి పిలచి ?, ఇలాంటి వాళ్లు ఉన్నారా ?, మ్యాటర్ ?

ఆన్‌లైన్‌లో బుక్ చేసిన ఐఫోన్ మొబైల్ ఫోన్ పార్శిల్‌ను డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పార్శిల్ ఇవ్వాలని డెలివరీ బాయ్‌ను ఇంట్లోకి పిలిచాడు. అక్కడే అసలు కథ మొదలు పెట్టాడు.

బెంగళూరు/హాసన్: డబ్బులు లేకపోయినా ఆన్‌లైన్‌లో ఐఫోన్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి క్యాష్ ఆన్ డెలివరీకి ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసిన ఐఫోన్ మొబైల్ ఫోన్ పార్శిల్‌ను డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో అతని వద్ద ఐఫోన్ మొబైల్ ఫోన్ కు డబ్బులు ఇవ్వడాని క్యాష్ లేదు. నా పేరు మీద ఉన్న పార్శిల్ ఇవ్వాలని డెలవరిబాయ్ ని అతను బెదిరించాడు. ఆ సమయంలో పార్శిల్ ఇవ్వాలని డెలివరీ బాయ్‌ను ఇంట్లోకి పిలిచాడు. అక్కడే అసలు కథ మొదలు పెట్టాడు.

డెలవరీ బాయ్ హత్య

డెలవరీ బాయ్ హత్య

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని అరసీకెరె తాలూకాలోని హలేకల్లనాయకనహళ్లికి చెందిన హేమంత్ నాయక్ (23) అనే యవకుడు హత్యకు గురైనాడు. హేమంత్ నాయక్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అరసీకెరె నగర్ లక్ష్మీపూర్‌కు చెందిన హేమంత్ దత్తా (20) అనే యువకుడు హమంత్ నాయక్ ను హత్య చేశాడుని వెలుగు చూడటంతో అందరూ మడలిపోయారు.

కేసు పెట్టిన కంపెనీ యాజమాన్యం

కేసు పెట్టిన కంపెనీ యాజమాన్యం

డెలివరీ బాయ్‌ హేమంత్‌ నాయక్‌ను హత్య చేసిన మూడు రోజుల పాటు మృతదేహాన్ని దత్తా అతని ఇంట్లోనే ఉంచాడు. ఈ కార్ట్ ఎక్స్‌ప్రెస్ (ఈ-కార్ట్ ఎక్స్‌ప్రెస్)లో పనిచేస్తున్న హేమంత్ నాయక్ కనిపించకపోవడంతో ఆ సంస్థ నిర్వహకులు హాసన్ జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. డెలవరీబాయ్ ఎక్కడికో వెళ్లి ఉంటాడని పోలీసులు అన్నారు. అయితే డెలవరీ బాయ్ హేమంత్ ఆచూకి లేకపోవడంతో పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చూసి దర్యాప్తు చేస్తే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

ఇది మ్యాటర్ సార్

ఇది మ్యాటర్ సార్

ఈ కార్ట్‌లో హేమంత్ దత్తా సెకండ్ హ్యాండ్ యాపిల్ మొబైల్‌ను బుక్ చేసుకున్నారు. ఈ-కార్ట్‌లో డెలివరీ చేసేందుకు వెళ్లిన హేమంత్ నాయక్ ఇంటికి వెళ్లాడు. హేమంత్ నాయక్ ను అతను ఇంట్లోకి పిలిచాడు. ఆ సమయంలో డబ్బులు తెస్తాను ఇక్కడ కూర్చో అంటూ లోపలికి వెళ్లిన హేమంత్ దత్తా వెనుక తలుపు నుంచి వచ్చి ఇంట్లో కూర్చున్న డెలవరీ బాయ్ హేమంత్ నాయక్ పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మూడు రోజులు ఫ్రిజ్ లో శవం

మూడు రోజులు ఫ్రిజ్ లో శవం

డెలవరీ బాయ్ హేమంత్ నాయక్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి ఫిబ్రవరి 11న మృతదేహాన్ని స్కూటర్‌లో ఎత్తుకుని బయటకు విసిరేందుకు వెళ్లాడు. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టుకుని స్కూటర్‌పై వెళ్లాడు. అరసీకెరె నగర శివార్లలోని అంచె కొప్పలు రైల్వే వంతెన సమీపంలో డెలవరీ బాయ్ హేమంత్ నాయక్ మృతదేహం మీద పెట్రోల్ పోసి తగులబెట్టాడు.

చిక్కిపోయిన కన్నింగ్ ఫెలో

చిక్కిపోయిన కన్నింగ్ ఫెలో

పోలీసుల కేసు విచారణలో హేమంత్ నాయక్ మృతదేహాన్ని స్కూటీలో తీసుకెళ్లి తగులబెట్టేందుకు పెట్రోల్‌ కొంటున్న దృశ్యం సీసీటీవీలో రికార్డు అయిన విషయం వెలుగు చూసింది. డెలవరీ బాయ్ హేమంత్ నాయక్ ను ఓ యువకుడు హత్య చేసి మృతదేహాన్ని మూడు రోజుల పాటు దాచి పెట్టి తగులబెట్టిన ఘటనను చూడటంతో అరసికెరె ప్రజలు హడలిపోయారు. హేమంత్ నాయక్ అనే డెలవరీ బాయ్ ని అనుమానం లేకుండా హత్య చేసిన హేమంత్ దత్తాను హసన్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+