వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Khiladi wife: అంతర్జాతీయ రేస్ బైక్ రైడర్ హత్య కేసు, మూడేళ్లకు కిలాడీ పెళ్లామ్ ?, ఐటీ హబ్ లో లవర్ తో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ జైసల్మేర్: అంతర్జాతీయ రేస్ బైక్ రైడర్ అతని స్నేహితులతో కలిసి బైక్ రేస్ లో పాల్గొనడానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చెయ్యడానికి వెళ్లిన తరువాత అతను కనపడకుండా పోయాడు. ఎడారిలో తప్పిపోయిన బైక్ రైడర్ కొన్ని రోజుల తరువాత శవమై కనిపించాడు. ఎడారిలో సరైన సమయంలో తాగడానికి నీళ్లులేక, ఆకలితో చనిపోయాడని అందరూ అనుకున్నారు. తన భర్త మరణం వెనుక తనకు ఎలాంటి అనుమానాలు లేవని రేస్ బైక్ రైడర్ భార్య పోలీసులకు చెప్పింది. పోలీసులు సాదారణ మరణం కేసు నమోదు చేశారు. అయితే తన సోదరుడు హత్యకు గురై ఉంటాడని రేస్ బైక్ రైడర్ సోదరి పోలీసు కేసు పెట్టింది. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన వెంటనే రేస్ బైక్ రైడర్ భార్య మొబైల్ నెంబర్ మార్చేసి మాయం అయ్యింది. మూడు సంవత్సరాల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న కిలాడీ లేడీ చివరికి ఐటీ హబ్ లో పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది.

Leader: ఫేస్ బుక్ ప్రియురాలితో ?, బెడ్ రూమ్ వీడియోలతో ?, అధికార పార్టీ లీడర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్!Leader: ఫేస్ బుక్ ప్రియురాలితో ?, బెడ్ రూమ్ వీడియోలతో ?, అధికార పార్టీ లీడర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

అంతర్జాతీయ రేస్ బైక్ రైడర్

అంతర్జాతీయ రేస్ బైక్ రైడర్

కేరళకు చెందిన అస్బక్ మోన్ అంతర్జాతీయ రేస్ బైక్ రైడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అస్బక్ మోన్ కొన్ని సంవత్సరాల క్రితం కేరళకు చెందిన సుమేరా పర్వేజ్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య పర్వేజ్ తో కలిసి ఉంటున్న అస్బక్ మోన్ దేశ విదేశాల్లో జరుగుతున్న బైక్ రేస్ పోటీల్లో పాల్గొంటున్నాడు.

 రాజస్థాన్ లో మాయం

రాజస్థాన్ లో మాయం


అంతర్జాతీయ రేస్ బైక్ రైడర్ అస్బక్ మోన్ 2018లో ఆగస్టు నెలలో రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరుగుతున్న అంతర్జాతీయ బైక్ రేస్ పోటీల్లో పాల్గొనడానికి వెళ్లాడు. అస్బక్ మోన్ అతని స్నేహితులుతో కలిసి బైక్ రేస్ లో పాల్గొనడానికి జైసల్మేర్ లోని ఏడారిలో వెళ్లాడు. స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చెయ్యడానికి వెళ్లిన అస్బక్ మోన్ తరువాత అతను కనపడకుండా పోయాడు.

ఎడారిలో శవమైన రేస్ బైక్ రైడర్

ఎడారిలో శవమైన రేస్ బైక్ రైడర్

ఎడారిలో తప్పిపోయిన బైక్ రైడర్ అస్బక్ మోన్ కొన్ని రోజుల తరువాత ఎడారిలోనే శవమై కనిపించాడు. ఎడారిలో సరైన సమయంలో తాగడానికి నీళ్లులేక, ఆకలితో అస్బక్ మోన్ చనిపోయాడని అందరూ అనుకున్నారు. తన భర్త అస్బక్ మోన్ మరణం వెనుక తనకు ఎలాంటి అనుమానాలు లేవని రేస్ బైక్ రైడర్ భార్య పర్వేజ్ అప్పట్లో రాజస్థాన్ పోలీసులకు చెప్పింది.

మూడు ఏళ్ల క్రితం మాయం అయిన భార్య

మూడు ఏళ్ల క్రితం మాయం అయిన భార్య

రాజస్థాన్ లోని జైసల్మేర్ పోలీసులు మోన్ ది సాదారణం మరణం కేసు అని నమోదు చేశారు. అయితే తన సోదరుడు మోన్ హత్యకు గురై ఉంటాడని రేస్ బైక్ రైడర్ సోదరి పోలీసు కేసు పెట్టింది. అప్పటి జైసల్యేర్ జిల్లా ఎస్పీ భవానీ సింగ్ అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన వెంటనే రేస్ బైక్ రైడర్ మోన్ భార్య పర్వేజ్ ఆమె మొబైల్ నెంబర్ మార్చేసి మాయం అయ్యింది.

మూడేళ్లకు కిలాడీ భార్య అరెస్టు

మూడేళ్లకు కిలాడీ భార్య అరెస్టు

మూడు సంవత్సరాల నుంచి పర్వేజ్ రాజస్థాన్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. పర్వేజ్ ను పట్టుకోవడానికి రాజస్థాన్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు చేరుకున్న పర్వేజ్ అక్కడే సీక్రేట్ గా మకాం వేసి ఆమె ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది. రెండు రోజుల క్రితం రాజస్థాన్ పోలీసులు పర్వేజ్ ఆచూకి గుర్తించి ఆమెను బెంగళూరులో అరెస్టు చేసి జైసల్మేర్ కు తీసుకెళ్లారు.

 పోలీసు కస్టడీకి కిలాడీ లేడి

పోలీసు కస్టడీకి కిలాడీ లేడి


కోర్టు ముందు హాజరుపరిచి న్యాయమూర్తి సహాయంతో 10 రోజులు తమ కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నామని జైసల్మేర్ పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే బైక్ రైడర్ మోన్ హత్య కేసులో అతని స్నేహితులు సంజయ్ కుమార్, విశ్వాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు తప్పించుకున్నాడని రాజస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Khiladi wife: Rajasthan police got a big breakthrough in the high-profile murder case of international biker Asbak Mon when it arrested his wife Sumera Parvez, the mastermind of the crime,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X