సెక్సీ గర్ల్స్ టార్గెట్, వీడు మగాడురా బుజ్జీ, సెంట్రల్ ఏసీ అయినా, సెంట్రల్ జైలు అయినా ఓకే !

బెంగళూరు: ఐటీ హబ్, సిలికాన్ సిటీ గా పేరు తెచ్చుకున్న బెంగళూరులో పని చేసేందుకు వచ్చిన యువకులను, వ్యాపారానికి వచ్చే వ్యాపారవేత్తలను ట్రాప్ చేసేందుకు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ రాష్ట్రం వెలుపలి అమ్మాయిలను రప్పించుకుని వ్యభిచార వ్యాపారానికి వాడుకుంటున్న మ్యాటర్ బయటకు రావడంతో అందరూ హడలిపోయారు.

బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసిన ఈసంఘటన వివరాలు కలకలం రేపింది. మంజునాథ్ అలియాస్ మంజు అనే నిందితుడు జైలుకు వెళ్లినా వ్యభిచార వ్యాపారాన్ని వదులుకోలేని నిందితుడి అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. ఫుల్ టైమ్ వ్యభిచారం వైపు మళ్లిన ఓ పింప్ జైల్లోనే తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడని వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు.

King Pin runs a hi-tech brothel while serving a sentence in Bengaluru Central Jail

లోకాంటో యాప్ ద్వారా ఫుల్ టైమ్ హైటెక్ వ్యభిచారం బిజినెస్ చేస్తున్నాడు. గతంలో బెంగళూరులోని సుద్దగుంటెపాళ్యంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన పింప్ మంజు లోకాంటో యాప్ ద్వారా అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతున్నాడు. బయటి రాష్ట్రాల నుంచి ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయిలే మంజు టార్గెట్. అలాంటి అమ్మాయిల కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేసి వారికి అద్దె ఇల్లు ఇప్పించి అక్కడే ఉంచేవాడని పోలీసులు అంటున్నారు.

ఆ తర్వాత మొదటగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, ఎక్కువ ఆదాయం వచ్చేలా ఈ వ్యభిచార వ్యాపారం చేయమని వారిని ఒప్పించి.. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను ఈ పింప్ మంజు నాశనం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. జైలు నుంచి బయటకు రావడానికి, యువతులపై నిఘా పెట్టేందుకు మంజు కొందరు యువకులను కూడా నియమించుకున్నాడు.అయితే జైలులో ఉన్నప్పుడు లుసెంటో యాప్ ద్వారా కస్టమర్లను ఈ కింగ్ పిన్ మంజు ఆకర్షించేవాడని పోలీసులు అంటున్నారు.

King Pin runs a hi-tech brothel while serving a sentence in Bengaluru Central Jail

అక్కడ సెక్స్ పట్ల ఆసక్తి చూపే కస్టమర్లను మంజు వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదించేవాడు. ఆ తర్వాత అమ్మాయిల లొకేషన్‌ను పంపించి, అమ్మాయిల వయసు, అందం, సమయాన్ని బట్టి కస్టమర్ల నుంచి డబ్బులు ఫిక్స్ చేసి గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించాలని మంజు డిమాండ్ చేశావడని తెలిసింది. మంజు జైలులో ఉన్నా బెంగళూరులోని హుళిమావు సమీపంలోని ఓ అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గతంలో మంజు సుందగుంటెపాళ్యంలో కూడా లోకాంటో యాప్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇప్పుడు జైలులో ఉన్నప్పటికీ, హుళిమావు అద్దె ఇంట్లో వ్యభిచార వృత్తిని నిర్వహిస్తున్న మంజు సైలెంట్ గా అతని పని అతను చేసుకోవడం కలకలం రేపింది. అరుణ్, రాజేష్, రాఘవేంద్ర, దర్శన్ తదితరులు హైటెక్ వ్యభిచారం నిర్వహించడానికి మంజుకు సహాయం చేస్తున్నారని వెలుగు చూసిందని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడి మీద బెంగళూరులోని హుళిమావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న మంజు అలియాస్ సంజు మినహా మిగిలిన నిందితులను సీసీబీ విచారిస్తున్నారు. అలాగే బాడీ వారెంట్ పొందిన తర్వాత బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న మంజు అలియాస్ మంజునాథ్ బెంగళూరు సీసీబీ పోలీసులు విచారించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+