Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతులకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌ - రుణం పెంపు..!!

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే కేంద్రం రైతులకు ఏటా రూ 6 వేల చొప్పున పీఎం - కిసాన్ పథకం ద్వారా ఆర్దికంగా చేయూత ఇస్తోంది. ఈ పథకానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కలిపి రైతులకు అందిస్తున్నారు. ఈ నెల లోనే 20వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. ఇక, కేంద్రం రైతుల కోసం అందుబాటులోకి తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మరింత ఆర్దికంగా తోడ్పాటు అందించేందుకు తక్కువ వడ్డీకే ఎక్కువ రుణం ఇవ్వాలని నిర్ణయించింది.

కేంద్రం అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డులకు రైతులకు వరంగా మారాయి. రైతులకు సులభంగా రుణాలను అందించడం, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల్లో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించడం లక్ష్యంగా నిర్ణయించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు మరియు పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. దీని ద్వారా స్థిరమైన వ్యవసాయ పద్ధతుల వైపు మార్పును ప్రోత్సహిస్తుంది. ఈ పథకం కింద, రైతులు తక్కువ వడ్డీ రుణాలు మరియు అనువైన చెల్లింపు ఎంపికల నుండి లాభపడతున్నారు.

kisan-credit-cards-support-sustainable-farming-in-india

కేంద్రం అందిస్తున్న ఈ ఆర్థిక మద్దతు వారికి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే ఆధునిక సాంకేతికతలను అందిచటంలో సహాయకారిగా నిలుస్సతోంది. కిసాన్ క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం మరియు సహజ వన రులను సంరక్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ కార్యక్రమం భారతదేశం యొక్క ఆహార భద్రత మరియు పర్యావరణ స్థిరత్వా న్ని సాధించడటం లక్ష్యంగా నిర్ణయించింది. ఇక, ఇప్పుడు తాజాగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు 7.7 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు కేంద్రం తెలిపింది.

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా స్వల్పకాలిక పంట రుణాలు ఇప్పుడు సులభతరం చేస్తూ... రుణ పరిమితిని పెంచారు. అందులో భాగంగా రైతు సకాలంలో చెల్లిస్తే, రూ.3 లక్షల వరకు రుణంపై 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. దీనితో పాటు, రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించినందుకు 3 శాతం అదనపు సత్వర చెల్లింపు ప్రోత్సాహకం (PRI) కూడా అందిస్తుంది. దీని కారణంగా రైతులు ప్రతి లక్ష రూపాయలపై ప్రతి సంవత్సరం దాదాపు రూ.9,000 వడ్డీని ఆదా చేయవచ్చని కేంద్రం ఆర్దిక శాఖ వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+