కోల్‌కత్తా: ఇండియన్ కాఫీ హౌస్ వద్ద "కిస్ ఆఫ్ లవ్"
న్యూఢిల్లీ: కేరళలోని కొచ్చిలో మొదలైన్ "కిస్ ఆఫ్ లవ్" నిరసన ఇప్పుడు కోల్‌కత్తాకు పాకింది. మోరల్ పోలీసింగ్, లింగ వివక్షకు వ్యతిరేకంగా కోల్‌కత్తాలోని రెండు యూనివర్సిటీల విద్యార్ధులు ఈ కార్యక్రమం చేపట్టారు.
కోల్‌కత్తాలోని ప్రముఖ విశ్వవిద్యాలయమైన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విద్యార్ధులు గురువారం ఇండియన్ కాఫీ హౌస్ ఎదురుగా గుమికూడి "కిస్ ఆఫ్ లవ్"కు సంఘీభావంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఇక జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం విద్యార్ధులు, పూర్వ విద్యార్ధులు కలిసి సుమారు 300 మంది బుధవారం సాయంత్రం జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో విద్యార్ధులు పరస్పరం అలింగనం చేసుకుని, ముద్దులు పెట్టుకుని నిరసన తెలిపారు. "మా దేహం, మా ఆలోచన, మోరల్ పోలీసింగ్‌ను ఒప్పుకోం" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుచిత్రాని ముద్దు పెట్టుకున్న పిహెచ్‌డి విద్యార్ధిని సయాంతాని మాట్లాడుతూ తమ స్వేచ్చను అడ్డుకుంటున్నందుకు, భావ ప్రకటన స్వేచ్చను హరిస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కోచిలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన నిర్వహకులకు టచ్‌లోనే ఉన్నామని తెలిపింది ఇంగ్లీషు లిటరేచర్ మూడవ సంవత్సరం చదువుతున్న రోనితా సన్యాల్ చెప్పింది.
మహారాష్ట్రలో ఓ దళిత అబ్బాయి.. అగ్రకుల అమ్మాయితో సంబంధం పెట్టుకోవడంతో ఆ అబ్బాయితో పాటు తల్లిదండ్రులను చంపివేశారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా ఈ "కిస్ ఆఫ్ లవ్" కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications