రైలులో రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
రాత్రి వేళ ప్రయాణ సమయంలో ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రైల్వే కొన్ని నియమ నిబంధనలను రూపొందించి వాటిని అమలు చేసేలా చూస్తుంటుంది.
రాత్రి సమయంలో ప్రయాణించి ఉదయం గమ్యస్థానానికి చేరుకోవాలనేవారంతా రైలులో ప్రయాణం చేయడాన్ని ఎంపిక చేసుకుంటారు. విడగా పగటి సమయంలో ప్రయాణిస్తే రోజంతా ప్రయాణానికే కేటాయించాల్సి ఉంటుంది. అందుకే చాలామంది రిజర్వేషన్ చేయించుకొని జర్నీ చేస్తారు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. దీనివల్ల రద్దీని నియంత్రించడంతోపాటు ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిబంధనలను రూపొందించారు. ఇవి పాటించడంలో విఫలమైతే అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రాత్రి 10.00 గంటల తర్వాత మొబైల్ ఆన్ చేసి పాటలు వినడం, శబ్దం చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడటం చేయకూడదు. రైలుకు సంబంధించిన లైట్లు తప్ప ఇతర లైట్లేవీ వాడకూడదు. గుంపుగా చేరి కబుర్లు చెప్పుకోవడంవల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ధూమపానం లేదంటే మద్యం తీసుకోవడం, ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం పూర్తిగా నిషేధించింది. మండటానికి అవకాశం ఉన్న గ్యాస్ సిలిండర్, కిరోసిన్, పెట్రోలు లాంటివి రైలులో తీసుకువెళ్లడాన్ని అనుమతించరు. ఈ నిబంధనలను ప్రయాణికులు పాటించేలా చూడాలని టీటీఈలు, ఆన్‌బోర్డ్ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులను రైల్వే ఆదేశాలు జారీచేస్తుంది.

రిజర్వేషన్ చేయించుకున్న మిడిల్ బెర్త్ ను రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు తెరుచుకోవచ్చు. ఆ సమయంలోనే ఆ బెర్త్ బుక్ చేసుకున్నవారు నిద్రించాలి. ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు లోయర్ బెర్త్ మీద కూర్చోవచ్చు. రాత్రి 10.00 గంటల తర్వాత రైలులో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అందుబాటులో ఉండదు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని, ప్రశాంతమైన ప్రయాణాన్ని అందించడానికే రైల్వే ఈ ఏర్పాట్లు చేసింది. కాబట్టి రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులంతా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత కూడా రైల్వే పైనే ఉంది.













Click it and Unblock the Notifications