మిస్టరీ మరణాలు, హత్యలకు జయలలిత వీలునామా కోసమేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వీలునామా కోసమే జయ ఏస్టేట్ కొడనాడులో మిస్టరీ హత్యలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. జయలలిత ఏస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్య కేసులో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మరణించారు. మరోకరు తృటిలో చావునుండి తప్పించుకొన్నారు.అయితే ఈ హత్య కేసుకు సంబంధించి మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఎలాంటి వీలునామా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.ఈ మేరకు ఓ ఆర్ టి ఐ కార్యకర్త ఇచ్చిన ధరఖాస్తు మేరకు ప్రభుత్వం ఈ మేరకు స్పష్టం చేసింది.

మరో వైపు గత నెల 24వ, తేది నుండి జయలలిత ఏస్టేట్ వద్ద చోటుచేసుకొంటున్న పరిణామాలు మిస్టరీగా మారాయి.సెక్యూరిటీ గార్డును హత్య చేసి కొన్ని విలువైన పత్రాలను ఏస్టేట్ నుండి ఎత్తుకెళ్ళారని పోలీసులు గుర్తించారు.

అయితే సెక్యూరిటీ గార్డు హత్యకేసులో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పదస్థితిలో మరణించాడు.మరో వ్యక్తి కేరళలో జరిగిన రోడ్డుప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.అయితే ఆయన భార్య, పిల్లలు మాత్రం ఈ ఘటనలో చనిపోయారు.

వరుస ఘటనలు , మిస్టరీ మరణాలు

వరుస ఘటనలు , మిస్టరీ మరణాలు

వరుసపెట్టి గృహదహనాలు, హత్యలు, దోపిడిలు జరుగుతున్నాయి. కొడనాడులోని జయలలిత ఏస్టేట్ లో ఓం బహదూర్ అనే వాచ్ మెన్ ను చంపేసి అక్కడ కీలకమైన కొన్ని పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్ళారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు ఒకే సమయంలో ప్రమాదానికి గురయ్యారు. ఒకు తమిళనాడులోని సేలంలోనూ, మరోకరు కేరళలో ప్రమాదాలకు గురయ్యారు. సేలంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, కేరళలో మరణించిన వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు.అయితే ఆయన భార్య, కూతురు చనిపోయారు.

వీలునామా కోసమేనా?

వీలునామా కోసమేనా?

జయలలిత వీలునామా కోసమే ఇదంతా జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ కేసుల దర్యాప్తు సందర్భంగా ఈ విషయం వెలుగుచూసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.జయలలితకు భారీగా ఆస్తులున్నాయి.అయితే ఈ ఆస్తులు ఎవరికీ దక్కుతాయనే విషయమై ఆమె జీవించి ఉన్నంత కాలం ఎవరికీ తెలియలేదు. బహుశా ఆమె వీలునామా రాసి ఉంటారని అనుమానిస్తున్నారు. కొడనాడు ఏస్టేట్ లోనే వీలునామా ఉండొచ్చనే అనుమానంతో దాడికి దిగారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

ఏం పోయాయంటే?

ఏం పోయాయంటే?

గత నెల 23వ, తేదిన అర్ధరాత్రి సమయంలో కొడనాడు ఏస్టేట్ వద్దకు మూడు వాహనాల్లో 11 మంది దుండగులు వచ్చారు. అక్కడున్న ఇద్దరు వాచ్ మెన్ల మీద దాడి చేశారు. వారిలో ఒం బహదూర్ థాపా అక్కడికక్కడే మరణించారు. కృష్ణ బహదూర్ థాపా గాయాలతో బయటపడ్డాడు. జయలలిత, శశికళ ఉపయోగిస్తారని భావించిన మూడు గదుల్లోని కిటీకి అద్దాలు పగులగొట్టి లోపలకు వెళ్ళారు. అక్కడున్న విలువైన వస్తువలను తీసుకెళ్ళారు.అయితే ఐదు వాచీలు, ఒక క్రిస్టల్ షోపీస్ మాత్రమే అపహరణకు గురైనట్టు పోలీసులు చెబుతున్నారు.

కేరళ ప్రమాదంలో హత్య కేసు నిందితుడు

కేరళ ప్రమాదంలో హత్య కేసు నిందితుడు

కొడనాడు ఏస్టేట్ లో జరిగిన హత్య కేసులో రెండో ప్రధాన నిందితుడుగా ఉన్న సాయన్. కేరళలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన భార్య, కుమార్తై మరణించారు. దీంతో ఇప్పుడే అతడిని ప్రశ్నించే పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. జయలలిత గదిలో ఉన్న ఒకే ఒక సూట్ కేసులోనే వీలునామా ఉండొచ్చని ఆమె వద్ద పనిచేసేవాళ్ళు చెబుతున్నారు.ఈ సూట్ కేసు విషయం జయలలిత, శశికళకు మరికొందరికి మాత్రమే తెలుసునని చెప్పారు.

ఈ హత్య కేసులో ఏడుగురి అరెస్టు

ఈ హత్య కేసులో ఏడుగురి అరెస్టు

కొడనాడు హత్యకేసులో సోమవారం నాడు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.సోమవారం నాడు కేరళ రాష్ట్రంలో వలయార్ అలియాస్ మనోజ్ ను అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన త్రిస్సూర్ కు చెందినవాడుగా పోలీసులు చెబుతున్నారు. అయితే మరో ఇద్దరి గురించి గాలిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Nilgiris district police on Monday confirmed that another person had been arrested in connection with the murder of a security guard during an attempted burglary at the Kodanad Estate, belonging to former Chief Minister Jayalalithaa, on April 24.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి