అధికార పార్టీ లీడర్ హత్య, ఎన్ కౌంటర్ లో సేమ్ పార్టీ లీడర్ ?, ఇద్దరు మంత్రులు !

బెంగళూరు/కోలారు: కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలోని శ్రీనివాసపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కాంగ్రెస్‌ నేతను హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత కోలారు జిల్లాలోని లక్ష్మీసాగర్ అటవీ ప్రాంతంలో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఎన్ కౌంటర్ జస్ట్ మిస్ అయ్యింది.

కాంగ్రెస్‌ నేత ఎం. శ్రీనివాస్‌ హత్యకేసులో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు వారి మీద కాల్పులు జరిపి వారిని అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అరెస్టు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. హంతకులను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తుండగా నిందితులు ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి తప్పించుకోవాలని ప్రయత్నించారని తెలిసింది.

Kolar police opened fire on the killers who killed the Congress party leader

పోలీసుల మీద దాడి చెయ్యడమే కాకుండా నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో ముగ్గురు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపిన వేమగల్ పోలీసు ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ నిందితలను పట్టుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన ముగ్గురు నిందితులు, ముగ్గురు పోలీసులు కోలారు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Kolar police opened fire on the killers who killed the Congress party leader

అరెస్టు అయిన వారిలో ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌, అతని సహచరులు మునీంద్ర, సంతోష్‌లు ఉన్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు వెతుకుతున్నారు. సోమవారం బైక్‌పై వచ్చిన ఆరుగురు వ్యక్తులు పదునైన ఆయుధాలతో శ్రీనివాస్‌ను నరికి చంపారు. శ్రీనివాస్‌ను కోలారు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స విఫలం కావడంతో శ్రీనివాస్‌ తుది శ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు.

నివేదికల ప్రకారం హత్యకు గురైన శ్రీనివాస్, నిందితుడు వేణుగోపాల్ ఇద్దరూ కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్‌కు సన్నిహితులు. శ్రీనివాస్‌, వేణుగోపాల్‌ల మధ్య గత ఏడేళ్లుగా భూవివాదం ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్‌పూర్ శివారులోని హోళగెరె రోడ్డులో వివాదాస్పద స్థలంలో శ్రీనివాస్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్మిస్తున్నాడు. ఇదే విషయంలో వేణుగోపాల్, శ్రీనివాస్ మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి.

Kolar police opened fire on the killers who killed the Congress party leader

దీంతో కోపోద్రిక్తుడైన వేణుగోపాల్ సోమవారం తన స్నేహితులతో కలిసి శ్రీనివాస్‌ను హత్య చేసినట్లు సమాచారం. శ్రీనివాస్ కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జి పరమేశ్వరకు, మరో మంత్రి కేహెచ్ మనియప్పకు చాలా సన్నిహిత మిత్రుడు అని అధికారులు అంటున్నారు. కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్‌ మునియప్ప, మాజీ స్పీకర్ రమేష్‌కుమార్‌తోపాటు పలువురు నాయకులు శ్రీనివాస్ కు నివాళులర్పించి సంతాపం తెలిపారు. మంగళవారం శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్న సందర్బంగా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+