నటి శిల్పాశెట్టిపై కేసు నమోదు, మోసం చేసిందంటూ కోల్‌కత్తా సంస్ధ ఫిర్యాదు
కోల్‌కత్తా: బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై కోల్‌కత్తా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందింది. తమను రూ. 9 కోట్లకు బాలీవుడ్ నటి, వ్యాపార వేత్త శిల్పాశెట్టి మోసం చేసిందంటూ కోల్‌కత్తాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్ధ ఆరోపణలు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శిల్పా అండ్ రిపు సుదన్ కుంద్రా ఆఫ్ ఎస్సెన్షీయల్ స్టోర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శిల్పా నడుపుతోంది. ఈ సంస్ధలో తాము పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ అదనపు డైరెక్టర్ దేబసిస్ గుహ కేసు పెట్టారు.

దీంతో పోలీసులు శిల్పా, ఆమె సంస్ధపై నమ్మక ద్రోహం, మోసం, ఉద్దేశపూర్వక కుట్రతదితరమైనవి పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శిల్పాశెట్టి నడుపుతున్న కంపెనీలో రూ. 9 కోట్లు పెట్టుబడులు పెట్టామని, తిరిగి వాటిని చెల్లించకుండా ఆమె మోసం చేసిందని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతే కాకుండా, రెండేళ్లలో పదింతలు తిరిగిస్తామని పెట్టుబడులు పెట్టించి అనంతరం పట్టించుకోవడం మానేశారని, మోసం చేశారని సదరు సంస్ధ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ. 9 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా శిల్పాశెట్టి కంపెనీ కేటాయించిన రూ. 30 లక్షల ఈక్వీటీ షేర్లు బోగస్ అని తేలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications