భరించలేకపోతున్నా: జగన్‌పార్టీపై స్పీకర్‌కి గీత ఫిర్యాదు!
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినాయకత్వం తనను వేధింపులకు గురిచేస్తోందని ఆ పార్టీ అరకు లోకసభ సభ్యురాలు కొత్తపల్లి గీత సోమవారం సభాపతి సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. గీత ఉదయం స్పీకర్‌ను కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినాయకత్వంతోపాటు పలువురు ఇతర నాయకులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారట.
ఈ వేధింపుల పైన ఆమె లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడమే కాకుండా.. తన ఆరోపణలను నిరూపించుకునేందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా అందజేశారట. ఈ సందర్భంగా ఆమె పార్టీలో మహిళకు ఎలాంటి గౌరవం లేదు, భద్రత అసలు లేదని చెప్పారట.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కొందరు నాయకులు నెట్‌లో తనను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ పెట్టిన ఫోటోలు, రాతలకు సంబంధించిన వివరాలను స్పీకర్‌కు అందజేశారట. పలువురు నాయకులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, కొందరు నాయకుల వ్యవహారశైలి మూలంగా పార్టీలో కొనసాగటం తనకు కష్టంగా ఉందని స్పష్టం చేశారట.












Click it and Unblock the Notifications