ఈ ప‌రీక్ష రాయాలంటే మంగ‌ళ‌సూత్రం, మెట్టెలు తీయాల్సిందే...

హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహిత మహిళ‌లు వివాహానికి చిహ్నంగా మంగ‌ళ‌సూత్రం, కాలికి మెట్టెలు ధ‌రిస్తారు. ఈ సంప్ర‌దాయం ఎప్ప‌టినుంచో ఉన్న‌ది. అయితే, ఆ వివాహిత మంగ‌ళ‌సూత్రం, మెట్టెలు తీసివేయాల్సి వ‌స్తే, భ‌ర్త చ‌నిపోయిన‌ప్పుడు మాత్ర‌మే తీసివేయడం జ‌రుగుతుంది. అయితే, తాజాగా ఓ ప‌రీక్షకు హాజ‌ర‌యిన వివాహిత మ‌హిళ‌ల‌కు అక్క‌డి అధికారులు షాక్ న్యూస్ చెప్పారు. ఈ ప‌రీక్షకు హాజ‌ర‌వ్వాలంటే ఖ‌చ్చితంగా మెడ‌లోని మంగ‌ళ‌సూత్రం, కాలి మెట్టెలు తొల‌గించాల్సిందే అనే కండిష‌న్ పెట్టారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు తమ 'మంగళసూత్ర'ను తీసివేయాలని అధికారులు కోరారు. మంగ‌ళ‌సూత్రంతో పాటు, కాలి మెట్టెలు, చెవిపోగులు చేతి ఉంగరాలతో సహా వారి ఆభరణాలను కూడా తీసివేయాలని పరీక్ష అధికారులు కోరారు. అయితే ఈ ఘ‌ట‌న వివాదానికి దారితీసింది.

KPSC rules of removing mangal sutra for married women candidates draws criticism

గ్రూప్ సి పోస్ట్ పరీక్షకు హాజరయిన మహిళలు..:ఈ సంఘటన కేపీఎస్సీ పరీక్ష కలబురగిలోని బాలికల ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో వెలుగుచూసింది. గ్రూప్ సి పోస్ట్ పరీక్షకు హాజరయిన మహిళా అభ్యర్థులు తమ మంగళసూత్రాలు, కాలి ఉంగరాలు, చెవిపోగులు, ఇతర లోహ వస్తువులను తీసివేసి ప‌రీక్ష హాలులోకి ప్ర‌వేశించాల‌ని అధికారులు కోరారు. ఇలా చేయ‌డం ద్వారా పరీక్ష సమయంలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండ‌ద‌ని అధికారులు అన్నారు. వివిధ బోర్డులు. కార్పొరేషన్లలో పోస్టులను భర్తీ చేయడానికి అభ్యర్థులను రిక్రూట్ చేసే కేఈఏ పరీక్షలో కొంతమంది విద్యార్థులు గ‌తంలో చీటింగ్ చేసిన సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. ఆ సంఘ‌ట‌న‌లు వెలుగు చూసిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆ సమయంలో పరీక్ష హాలులో విద్యార్థులు బ్లూటూత్ తో కాపీయింగ్ పాల్పుడుతూ ప‌ట్టుబ‌డ్డం జ‌రిగిందే.

స్వ‌ర్ణకారుని సహాయంతో...:అయితే ప‌రీక్ష హాలుముందు మంగళసూత్రాలను తొలగించేందుకు ఇష్టపడని వివాహితులకు పరీక్షా కేంద్రాల అధికారులు లోప‌లికి వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అదనంగా, ఒక అభ్యర్థి తన చెవిపోగులను తీసివేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌చ్చింది. ఆ చెవి పోగులు రాకపోవడంతో స్వర్ణకారుని సహాయం తీసుకోవలసి వచ్చింది. మరోవైపు, హిజాబ్‌లు ధరించిన మహిళలను అధికారులు తనిఖీ చేసి, వారిని హిజాబ్‌తోనే పరీక్ష హాల్‌లోకి అనుమతించిన‌ట్లు తెలిసింది.

KPSC rules of removing mangal sutra for married women candidates draws criticism

ఈ విష‌యంపై స్పందించిన బెజిపి ఎమ్మెల్యే..:అయితే ఈ ఘ‌ట‌న‌పై ఓ మ‌హిళ ఆవేదన వ్యక్తం చేస్తూ.. "ఈ పరీక్ష కోసం నాతో మంగళసూత్రం, కాలి మెట్టెలు తీయించారు. వాటిని తీసివేసి నేను ప‌రీక్ష హాలులోపలికి వెళ్ళాను. ముస్లిం మహిళల హిజాబ్‌ని ఏ విధంగా తనిఖీ చేసి అనుమతించారో, అదే విధంగా మమ్మల్ని కూడా తనిఖీ చేసి లోపలికి అనుమతించాల్సింది" అని విద్యార్థి తెలిపింది. ఈ విష‌యంపై బిజెపి ఎమ్మెల్యే బసంగౌడ యత్నాల్ కూడా తీవ్రంగా స్పందించారు. మహిళా అభ్యర్థుల మంగళసూత్రాల తొలగింపు చర్య కేవలం హిందువుల కోసమేనా అని బసంగౌడ ప్రశ్నించారు. అంతేకాకుండా హిజాబ్ ధరించిన మహిళలను కూడా అధికారులు తనిఖీ చేశారని, అయితే వారిని లోపలికి అనుమతించారని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+