బాహుబలి మహామస్తాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి, ఎక్కడంటే, కౌంట్ డౌన్ షురు !
బెంగళూరు: కేఆర్‌ఎస్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని బసది హోస్కోటే గ్రామంలో బాహుబలి పునరుద్ధరణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. జగద్గురు కర్మయోగి స్వస్తిశ్రీ చారుకీర్తి భట్టారక అమరకీర్తి, శ్రావణ బెళగొళ మహర్షుల దివ్య సన్నిధిలో నవంబరు 25వ తేదీన బాహుబలి విగ్రహనికి నిర్వహించే మహామస్తాభిషేక కార్యక్రమానికి కొంతకాలం నుంచి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
భగవాన్ బాహుబలి దిగంబర బాహుబలి యొక్క 17 అడుగుల పొడవైన వైరాగ్య మూర్తిని పునఃప్రతిష్ఠాపన నిర్వహించడానికి జైన్ ట్రస్ట్ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీస్తుశకం 1147లో హోయసల రాజు బిత్తిదేవ్ (విష్ణువర్ధన రాజు) దగ్గర దండనాయకుడిగా పని చేసిన (తలారి) పునిసిమయ్య బాహుబలి ఏకశిలా విగ్రహం, వివిధ తీర్థంకరుల విగ్రహాలు, మంటపాలు నిర్మించారని రాతి శాసనం ద్వారా తెలుస్తుంది.

జైహన శ్రావకులు, శ్రావకులు, ట్రస్టు సభ్యులు తరతరాలుగా శ్రీక్షేత్రాన్ని పరిరక్షించుకుంటూ వస్తున్నారు. ఇంతకాలం వీళ్లే బాహుబలికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణరాజసాగర్ బ్యాక్ వాటర్ పక్కనే ఉన్న 15 అడుగుల వెడల్పాటి వరండాలో బహిరంగ ప్రదేశంలోని బాహుబలి రాతి విగ్రహాన్ని తూర్పు ముఖంగా ప్రతిష్టించారు.
జైన కాశీకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రావణబెళగొళ క్షేత్రానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బసది హోసకోటే జైన క్షేత్రం, పర్యాటకులను, యాత్రికులను ఆకట్టుకునేలా బసది హోస్ కోటే జైన క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. ఇదిలా ఉండగా 25వ తేదీన బాహుబలిస్వామి పునర్విగ్రహాభిషేకం, సిద్ధచక్ర ఆరాధనోత్సవంతో పాటు మహామస్తకాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బాహుబలి శిలామూర్తి పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్న దిగంబర్ అమోఘకీర్తి మహర్షులు మాట్లాడుతూ బసది హొసకోటేలో విశాలమైన సాగరం పక్కనే ప్రకృతి ఒడిలో తపస్సు చేస్తూ నిలబడిన బాహుబలి విగ్రహం దేశంలోనే అరుదగా ఉంటుందని అన్నారు. కర్ణాటకలో నివాసం ఉంటున్న జైన్ లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బాహుబలి మహామస్తాభిషేకం కార్యక్రమానికి హాజరు అవుతారని నిర్వహకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications