మా ఫ్యామిలీని మోసం చేసిన అప్ప, వాళ్ల ఫ్యామిలీకి న్యాయం చేసుకుంటారా ? తేల్చుకుంటా !
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలైంది. కర్ణాటక రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాల పేర్లను బీజేపీ ప్రకటించింది. కర్ణాటకలో 8 మంది సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు నిరాకరించిన బీజేపీ హైకమాండ్ వేరే నాయకులకు ఎంపీ టిక్కెట్లు ఇచ్చింది. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఇప్పటికే కర్ణాటకలోని బీజేపీకి చెందిన పలు వర్గాల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది.
కర్ణాటక మాజీ డీసీఎం కేఎస్. ఈశ్వరప్ప ఆయన కుమారుడికి ఈసారి టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ముందు భారీ లాబీయింగ్ చేశారు. హవేరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తన కుమారుడు కాంతేష్‌కు టికెట్ ఇవ్వాలని ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇప్పుడు హవేరీ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయనుండగా మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప కుమారుడు కాంతేష్ కు ఎంపీ టిక్కెట్ దక్కలేదు.

తన కుమారుడు కాంతేష్ కు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో కేఎస్ ఈశ్వరప్ప తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. తన కుమారుడికి టికెట్ రాకపోవడానికి మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కారణం అని మాజీ డీసీఎం కేఎస్. ఈశ్వరప్ప ఆరోపించారు. బీఎస్ యడియూరప్ప మాత్రం ఆయన కుమారుడు బీవై రాఘవేంద్రకు శివమొగ్గ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారని, తన కొడుక్కి మాత్రం బీఎస్ యడ్యూరప్ప మోసం చేశారని మాజీ డీసీఎం కేఎస్. ఈశ్వరప్ప ఆవేదన వ్యక్తం చేశారు.
బీఎస్ యడియూరప్ప కుటుంబం వల్లే కర్ణాటకలో బీజేపీ ఎదగలేదని, ఒక్క నాయకుడి వలనే బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి రాలేదని ఈశ్వరప్ప ఆయన అనుచరుల ముందు ఆవేవద వ్యక్తం చేశారని తెలిసింది. రాష్ట్రంలో యడియూరప్ప తప్పా వేరే లింగాయత్ నాయకులు లేరా? బీఎస్ యడియూరప్ప కావాలనే పట్టుబట్టి శోభా కరంద్లాజే, మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ లకు ఎంపీ టిక్కెట్ ఇప్పించుకున్నారని ఈశ్వరప్ప ఆరోపించారని తెలిసింది.

అయితే తన కొడుక్కి టికెట్ ఇవ్వకుండా యడియూరప్ప అన్యాయం చేశారని కేఎస్ ఈశ్వరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కూడా 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని, ఒక్క వ్యక్తి వల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదని, సదానంద గౌడ, నళిన్ కుమార్ కటీల్, ప్రతాప్ సింహా, సీటీ రవి లాంటి నేతలకు అన్యాయం చేస్తున్నారని కేఎస్. ఈశ్వరప్ప మండిపడ్డారు. ఆరోగ్య సమస్యల కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్వయంగా మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చెప్పారని ఈశ్వరప్ప గుర్తు చేస్తున్నారు.
అయితే బీఎస్ యడియూరప్ప మాత్రం బసవరాజ్ బోమ్మయ్ మీద ఒత్తిడి చేసి పట్టుబట్టి ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇప్పించారని, తన కొడుకు కాంతేష్ కు టికెట్ రాకుండా చేశారని ఈశ్వరప్ప ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేశారని ఈశ్వరప్ప ఆరోపించారు. పార్టీయేతర అభ్యర్థిగా పోటీ చేయాలని మద్దతుదారులు పట్టుబడుతున్నారని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నానని, మార్చి 15వ తేదీన తమ మద్దతుదారుల సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు సేకరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications