Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ డూప్ తో ర్యాలీలో ప్రత్యక్షం, అప్ప ఫ్యామిలీకి సినిమా చూపించిన ఈశ్వరప్ప, రెబల్ దెబ్బ!

తన కుమారుడికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టికెట్ నిరాకరించినందుకు బీజేపీపై తిరుగుబాటు చేసిన కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శివమొగ్గ లోక్‌సభ సీటును కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూప్ప తనయుడు, సిట్టింగ్ ఎంపీ బీవై రాఘవేంద్రపై గెలవాలని ఈశ్వరప్ప అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న కేఎస్ ఈశ్వరప్ప యడియూరప్ప కుటుంబానికి చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర బీజేపీపై తిరుగుబాటు చేసిన కేఎస్ ఈశ్వరప్ప ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుదారుగా ఉంటూ ఎన్నికల ప్రచారాల్లో ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేఎస్ ఈశ్వరప్ప తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఫొటోలను వాడుకోవడంపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

KS Eshwarappa who went along with thousands of people and nominated as an MP candidate

కానీ ఈశ్వరప్ప మాత్రం బీజేపీ నాయకుల చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం పట్టించుకోకుండా మోదీ ఫోటో, జెండాలు పెట్టుకుని పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శివమొగ్గలో స్వతంత్ర అభ్యర్థిగా కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫోటోలు ఉపయోగించారంటూ స్థానిక కోర్టులో బీజేపీ నాయకులు ఇప్పటికే కేసు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన నిర్ణయంపై మొండిగా ఉన్న ఈశ్వరప్పను బుజ్జగించడానికి బీజేపీ నాయకులు చేసిన రాజీ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

బీజేపీ నాయకులు మాటలు ఏమాత్రం పట్టించుకోని మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప శుక్రవారం వేలాది మంది మద్దతుదారులతో నామినేషన్‌ దాఖలు చేశారు. శివమొగ్గ జిల్లా నుంచే కాకుండా బైందూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వందలాది మంది మద్దతుదారులు శివమొగ్గ చేరుకుని కేఎస్ ఈశ్వరప్ప నామినేషన్‌ వేస్తున్న సమయంలో ఆయన వెంట వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప నామినేషన్ వేసే సమయంలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నప్పటికీ ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో ఉన్న వ్యక్తి కేఎస్ ఈశ్వరప్ప ర్యాలీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దూరం నుంచి చూస్తే అచ్చం ప్రధాని నరేంద్ర మోదీనేనా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గలోని ఈశ్వరప్ప అనుచరులతో పాటు చాలా మంది మోదీ లాంటి వ్యక్తిని చూసి మొదట అయోమయంలో ఉండిపోయారు. అయితే ఆ తర్వాత వారి గందరగోళానికి సమాధానం దొరికింది. ఉడిపి జిల్లా హిరియడ్క పట్టణంలోని బొమ్మరబెట్టు గ్రామానికి చెందిన సదానంద నాయక్ అచ్చం ప్రధాని నరేంద్ర మోదీలా కనిపిస్తున్నారు.

KS Eshwarappa who went along with thousands of people and nominated as an MP candidate

సాధారణ రోజుల్లో సదానంద నాయక్ వంట పని చేస్తున్నాడు, ఎన్నికల సమయంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ వేషధారణలో ప్రధాని నరేంద్ర మోదీ సభలు, బీజేపీ, హిందూ సంస్థలు నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో పాల్గొంటాడు. సదానంద నాయక్ అచ్చం ప్రధాని నరేంద్ర మోదీలా కనిపిస్తాడు, ఫస్ట్ లుక్‌లో చూసిన వాళ్లు తికమకపడాలి. అదేవిధంగా ఈశ్వరప్ప నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో సదానంద నాయక్‌ కూడా ఉండడంతో జనం చేతులు ఊపుతూ ఆయనకు అభివాదం చేశారు.

మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్పకు ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివెళ్లి ఆయనకు మద్దతుగా నిలిచారు. శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎస్ ఈశ్వరప్ప రాష్ట్ర బీజేపీ నేతలపై తిరుగుబాటు చేసి లోక్ సభ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి చూపిస్తానని, తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ ఆశీస్సులు తీసుకుని బీజేపీకి మద్దతు ఇస్తాను అని కేఎస్ ఈశ్వరప్ప చాలా ధీమాగా చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+